పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ త గాదాలో తన భార్యపై కేసు పెట్టిందనే కోపంతో… యువతిపై మహిళ భర్త అత్యాచారం చేశారు. అంతేకాక అత్యాచారాన్ని వీడియో తీసి బెదిరింపులకు దిగాడు. యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటుచేసుకుంది. తన భార్యపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని యువతికి వివాహితుడు బెదిరింపులకు దిగాడు. ఆపై ఆ యువతిని అత్యాచారం చేసి, వీడియోల చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే అత్యాచారం చేసిన వీడియోలను సామాజిక మాధ్యమంలో పెడతానని, అందరికీ పంపిస్తానని బెదిరింపులకు దిగాడు. అంతటితో ఆగకుండా చంపుతానని బెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు
ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వన్లైన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరంలోని వన్డేన్ పరిధిలో ఒక యువతి ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తోంది. ఆమెకు ఇటీవలి ఒక మహిళతో తగాదా రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈనెల 20వ తేదీన రాత్రి మహిళ భర్త అద్దంకి అరుణకుమార్ యువతి ఇంట్లోకి అక్రమంగా చొరబడ్డాడు. తన భార్యపై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలని బెదిరించాడు. అంతేకాక ఆ యువతిపై బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
యువతి ప్రతిఘటించింది. అయినప్పటికీ నోరు నొక్కి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా అత్యాచారానికి పాల్పిడిన ఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే వీడియోలను అందరికీ పంపిస్తానని, సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా చంపుతానని బెదిరించాడు. దీంతో బాధిత యువతి పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. సీఐ ఎం.నాగరాజు స్పందిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025