మేనకోడలి పెళ్లి చెడకొట్టేందుకు యువకుడి పన్నాగం
చరవాణులు మార్చి.. తప్పుడు సందేశాలు పెట్టి..
నిందితుడి పట్టివేత
విజయవాడ మేనకోడలి పెళ్లి చెడకొట్టేందుకు ఒక యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఆరు చరవాణులను మార్చి పెళ్లికుమారుడికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా పెళ్లి కుమార్తె గురించి తప్పుడు సందేశాలు పంపాడు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం మూడు నెలలు గాలించారు. నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేసి ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం, ఎన్ని తెలివితేటలున్నా చట్టం చేతికి దొరికిపోతారనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ అని పోలీసులు వెల్లడించారు.
విజయవాడకు చెందిన ఒక యువతికి వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజులకు పెళ్లి కుమారుడి చరవాణికి యువతి గురించి తప్పుడు సందేశాలు వచ్చాయి. దీనిపై యువతి కుటుంబ సభ్యులు విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు పెళ్లికుమారుడికి వచ్చిన సందేశాలు, వాటికి సంబంధించి చరవాణి ఐఎంఈఐ నంబర్ల గురించి ఆరా తీశారు. మొత్తం 6 చరవాణుల నుంచి మేసేజ్‌లు వచ్చినట్లు తెలుసుకొని వాటి యజమానుల గురించి ఆరా తీశారు.
తీగ లాగితే డొంక కదిలింది.. 6 చరవాణులు వాడుతున్న యజమానులను పోలీసులు పిలిపించారు. వారు తణుకు, మచిలీపట్నం, కంకిపాడు, దాములూరు, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని విచారించారు. అయితే ఆ ఆరుగురికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో మరో కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ ఆరు చరవాణులు ఎక్కడ నుంచి కొన్నారనే దానిపై ఆరా తీయగా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్సు పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒకే దుకాణం నుంచి ఈ చరవాణులు కొన్నట్లు గుర్తించి దుకాణదారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయింది.
సిమ్‌లు కొనుగోలు చేసి.. ఎన్టీఆర్ కాంప్లెక్సులో చరవాణులు విక్రయించిన యువకుడి
స్నేహితుడే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యువకుడు తన మేనకోడలు వివాహం చెడకొట్టేందుకు నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక వేశాడు. ముందుగా నాలుగు జీ మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాడు. 5 సిమ్‌లు కొనుగోలు చేసి ఆ తరువాత విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చాడు. ఎన్టీఆర్ కాంప్లెక్సులోని తన స్నేహితుడి వద్ద సెకండ్ హ్యాండ్ చరవాణి తీసుకుని దాని ద్వారా మేసేజ్‌లు పెట్టాడు. ఇలా ఒకదాని తరువాత మరొకటి చొప్పున మొత్తం 6 చరవాణులను దీని కోసం ఉపయోగించాడు. పోలీసులు ఒక్కో లింక్‌ను విడతీసుకుంటూ చివరకు నిందితుడిని గుర్తించారు. అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు.
Andhra Pradesh Dist
చరవాణులు మార్చి.. తప్పుడు సందేశాలు పెట్టి..
నిందితుడి పట్టివేత
విజయవాడ మేనకోడలి పెళ్లి చెడకొట్టేందుకు ఒక యువకుడు దారుణానికి తెగబడ్డాడు. ఆరు చరవాణులను మార్చి పెళ్లికుమారుడికి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్‌ల ద్వారా పెళ్లి కుమార్తె గురించి తప్పుడు సందేశాలు పంపాడు. దీనిపై సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి నిందితుడి కోసం మూడు నెలలు గాలించారు. నాలుగు జిల్లాల్లో తనిఖీలు చేసి ఎట్టకేలకు నిందితుడిని గుర్తించి పట్టుకున్నారు. ఎంతటి సాంకేతిక పరిజ్ఞానం, ఎన్ని తెలివితేటలున్నా చట్టం చేతికి దొరికిపోతారనేందుకు ఈ కేసు ఒక ఉదాహరణ అని పోలీసులు వెల్లడించారు.
విజయవాడకు చెందిన ఒక యువతికి వివాహం నిశ్చయమైంది. కొద్ది రోజులకు పెళ్లి కుమారుడి చరవాణికి యువతి గురించి తప్పుడు సందేశాలు వచ్చాయి. దీనిపై యువతి కుటుంబ సభ్యులు విజయవాడ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. కేసు దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైం పోలీసులు పెళ్లికుమారుడికి వచ్చిన సందేశాలు, వాటికి సంబంధించి చరవాణి ఐఎంఈఐ నంబర్ల గురించి ఆరా తీశారు. మొత్తం 6 చరవాణుల నుంచి మేసేజ్‌లు వచ్చినట్లు తెలుసుకొని వాటి యజమానుల గురించి ఆరా తీశారు.
తీగ లాగితే డొంక కదిలింది.. 6 చరవాణులు వాడుతున్న యజమానులను పోలీసులు పిలిపించారు. వారు తణుకు, మచిలీపట్నం, కంకిపాడు, దాములూరు, విశాఖపట్నం ప్రాంతాలకు చెందిన వారు కావడంతో వారిని విచారించారు. అయితే ఆ ఆరుగురికి ఎలాంటి సంబంధం లేకపోవడంతో మరో కోణంలో విచారణ ప్రారంభించారు. ఈ ఆరు చరవాణులు ఎక్కడ నుంచి కొన్నారనే దానిపై ఆరా తీయగా విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్సు పేరు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఒకే దుకాణం నుంచి ఈ చరవాణులు కొన్నట్లు గుర్తించి దుకాణదారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు గుట్టు రట్టయింది.
సిమ్‌లు కొనుగోలు చేసి.. ఎన్టీఆర్ కాంప్లెక్సులో చరవాణులు విక్రయించిన యువకుడి స్నేహితుడే ఈ నేరానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. యువకుడు తన మేనకోడలు వివాహం చెడకొట్టేందుకు నిర్ణయించుకుని పక్కా ప్రణాళిక వేశాడు. ముందుగా నాలుగు జీ మెయిల్స్ క్రియేట్ చేసుకున్నాడు. 5 సిమ్‌లు కొనుగోలు చేసి ఆ తరువాత విశాఖపట్నం నుంచి విజయవాడకు వచ్చాడు. ఎన్టీఆర్ కాంప్లెక్సులోని తన స్నేహితుడి వద్ద సెకండ్ హ్యాండ్ చరవాణి తీసుకుని దాని ద్వారా మేసేజ్‌లు పెట్టాడు. ఇలా ఒకదాని తరువాత మరొకటి చొప్పున మొత్తం 6 చరవాణులను దీని కోసం ఉపయోగించాడు. పోలీసులు ఒక్కో లింక్‌ను విడతీసుకుంటూ చివరకు నిందితుడిని గుర్తించారు. అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు.
