SGSTV NEWS
CrimeTelangana

Online Betting: వరంగల్లో ఆన్ లైన్ బెట్టింగ్తో మరో యువకుడు బలి..



వరంగల్‌ : ఆన్‌ లైన్‌ బెట్టింగ్‌కు యువకుడు బలైన ఘటన వరంగల్‌ జిల్లాలో జరిగింది. వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లైశెట్టి భాగ్యలక్ష్మి- కుమారస్వామిల మూడవ కొడుకు లైశెట్టి రాజు కుమార్‌ (26) డిగ్రీ పూర్తి చేసుకొని పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నాడు. ఈక్రమంలో … ఆన్‌ లైన్‌ బెట్టింగు మోజులోపడి సుమారు 30 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. గత వారం రోజులుగా తనకు 4 లక్షల రూపాయలు కావాలని తండ్రిని రాజు కుమార్‌ వేధించాడు. అయితే యువకుడికి తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో చాలాసార్లు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉదయం ఇంటికి తాళం వేసి తండ్రి బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఇంటికి వచ్చి చూసేసరికి కుమారుడు విగతజీవిగా కనిపించడంతో రోదించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also read



Related posts

Share this