గుత్తి : అనంతపురం జిల్లా గుత్తి రైల్వేస్టేషన్ లో బుధవారం ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే స్టేషన్ లోని ప్రభుత్వ రైల్వే పోలీస్ స్టేషన్ సమీపంలో వెళ్తున్న రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటనను స్థానికులు గమనించి జి ఆర్ పి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలాన్ని జిఆర్పి ఎస్ఐ నాగప్ప పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నంద్యాల జిల్లా అవుకు చెందిన మహేంద్ర (25) అనే యువకుడు అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో పనిచేస్తున్నాడని జిఆర్పి ఎస్ఐ తెలిపారు. ఆత్మహత్యకు కారణాలను తెలియ రాలేదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025