July 1, 2024
SGSTV NEWS
CrimeNational

లాయర్ : అందం, ప్రతిభ.. పైగా హైకోర్టు లాయర్.. ఆ చిన్న కారణంతో దారుణం

ఎంతో చదువకుంది.. హైకోర్టు వకీలుగా.. ఇతరులకు మంచి, చెడులు చెప్పే గొప్ప స్థానంలో ఉన్న మహిళ దారుణానికి పాల్పడింది. ఆమె చేసిన పని ప్రతి ఒక్కరిని షాక్ కు గురిచేసింది. ఇంతకు ఏం జరిగిందంటే..

పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళను చూశారా కదా.. అందానికి అందం.. దానికి తోడు అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం. పైగా హైకోర్టు లాయర్ గా విధులు నిర్వహిస్తోంది. ఎవరికి ఏ సమస్య వచ్చినా.. ఆమె ముందుకు వచ్చి.. ధైర్యం చెప్పేది..వారి సమస్యల పరిష్కారానికి తన వంతు సాయం చేసేది. సమాజంలో.. ఇటు కుటుంబంలో.. అటు బంధువర్గంలో ఆమెకు చాలా మంచి పేరుంది. అలాంటి మహిళ.. ఎవరూ ఊహించని దారుణ నిర్ణయం తీసుకుంది. ఆమె చేసిన పనికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రలు షాక్ లో ఉన్నారు. ఇంతకు ఆమె ఏం చేసిందంటే..

హైకోర్టు లాయర్ గా పని చేస్తోన్న మహిళ.. తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుని.. ప్రాణాలు విడిచింది. కర్ణాటకలో ఈ దారుణం చేటు చేసుకుంది. బెంగళూరుకు చెందిన కేఏఎస్‌ అధికారి భార్య, హైకోర్టు వకీలు అయిన చైత్ర.. తనింట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తాజాగా వెలుగు చూసింది. సంజయనగర పోలీసుస్టేషన్‌ పరిధిలో నివాసం ఉంటున్న కేఏఎస్‌ అధికారి శివకుమార్‌ భార్య చైత్రా హైకోర్టు వకీలుగా పని చేస్తున్నారు. వీరి ఇద్దరికి ఎనిమిదేళ్ల క్రితం అనగా 2016లో వివాహం జరిగింది. వారికి ఐదేళ్ల కుమార్తె కూడా ఉంది. ఇక చైత్ర భర్త శివకుమార్.. రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధి సంస్థలో సబ్‌ డివిజనల్‌ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు

ఇద్దరిది అన్యోన్య దాంపత్యమని బంధువులు, మిత్రులు ప్రశంసించేవారు. సంతోషంగా సాగుతున్న వారి జీవితంపై విధికి కన్ను కుట్టిందేమో.. వకీలుగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న చైత్ర దారుణం నిర్ణయం తీసుకుంది. శుక్రవారం రాత్రి ఇంటిలో ఆమె ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతో సంతోషంగా ఉన్న చైత్ర ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని ఎవరూ భావించలేదు. ఆమె చనిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇక మృతురాలి సోదరుడు ఇచ్చి ఫిర్యాదు ఆధారంగా సంజయనగర పోలీసులు కేసునమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

చైత్ర మృతిపై అనుమానాలు..
చైత్ర భర్త శివకుమార్‌ శుక్రవారం రాత్రి ఆయన డ్యూటీ నుంచి ఇంటికి తిరిగి వచ్చే చూసేసరికి.. ఆయన భార్య అచేతనంగా పడి ఉంది. దీంతో వెంటనే స్థానిక సంజయనగర పోలీసులకు కాల్‌ చేశారు. చైత్ర హైకోర్టు లాయరుగా పనిచేస్తూ ప్రతిభావంతురాలిగా గుర్తింపు పొందింది. అంతేకాక ఆమెకు షటిల్‌, బ్యాడ్మింటన్‌ వంటి ఆటల్లోనూ ప్రావీణ్యం ఉంది. ఎంతో చలాకీగా.. నవ్వుతూ.. నవ్విస్తూ ఉండే చైత్ర.. ఇలా ఆత్మహత్య
చేసుకుందంటే నమ్మశక్యంగా లేదని ఆమె బంధువులు, స్నేహితులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Also read



Related posts

Share via