పోలీసుల అదుపులో ఒంటరి మహిళలను మోసగిస్తున్న మాయగాడు
వివరాలు వెల్లడిస్తున్న ఇన్చార్జి డిఎస్సీ శ్రీకాంత్ చిత్రంలో నిందితుడు, పోలీసులు స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు:
రాజమహేంద్రవరం (ఏవీఏ రోడ్డు) వివాహ సంబంధాల కోసం మ్యాట్రిమోనీల్లో వివరాలు నమోదు చేసుకున్న ఒంటరి, వితంతు మహిళలను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. వారి బంగారు ఆభరణాలను అపహరిస్తున్న ఘరానా మోసగాడిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో సెంట్రల్ జోన్ ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీకాంత్ వివరాలు వెల్లడించారు. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పి.వడ్డూరు గ్రామానికి చెందిన చల్లా నారాయణ ఎలియాస్ నారాయణ కృష్ణ వివిధ పేర్లతో మ్యాట్రిమోనీల్లోని వివరాలతో వితంతు. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునేవాడు. తాను గోవాలో బంగారు వ్యాపారినంటూ వారికి వివాహ ప్రతిపాదనలు పంపేవాడు. పరిచయం పెంచుకున్నాక.. నీ జాతకంలో దోషాలు ఉన్నాయని, రాజమహేంద్రవరం వస్తే గోదావరిలో పుణ్యస్నానమాచరించి పూజలు చేద్దామంటూ నమ్మించేవాడు. నగలు పెట్టుకుని వస్తే మా తల్లిదండ్రులకు కూడా నచ్చుతావంటూ మాయమాటలు చెప్పేవాడు. ఇలా విశాఖ, నెల్లూరు, కడప, శ్రీకాకుళం, హైదరాబాద్కు చెందిన పలువురు మహిళలు రాజమహేంద్రవరం వచ్చారు. స్నానమాచరించిన అనంతరం పూజా సామగ్రి తీసుకొస్తానని చెప్పి, వారు తెచ్చిన బంగారు అభరణాల బ్యాగులతో ఉడాయించేవాడు. తొమ్మిది నెలల కాలంలో ఇతడిపై రాజమహేంద్రవరం మూడో పట్టణ పోలీస్ స్టేషన్లో ఐదు చీటింగ్ కేసులు నమోదయ్యాయని డీఎస్పీ వెల్లడించారు. నిందితుడి నుంచి సుమారు రూ.75 లక్షల విలువచేసే 340 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు కార్లు, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో పలు జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో పోక్సీ, చీటింగ్, మర్దర్, రౌడీషీట్ తదితర ఏడు కేసులున్నాయి. కర్ణాటకలోని చిక భళ్లాపుర పరిధిలో నాన్ బెయిల్బుల్ వారెంట్ ఉంది
Also read
- భర్తగా, తండ్రిగా ఓడిపోయా.. కూతురు జాగ్రత్త..! కన్నీళ్లు పెట్టిస్తున్న సివిల్ ఇంజనీర్ లాస్ట్ మెసేజ్!
- ఆపరేషన్ థియేటర్లో పీజీ వైద్యవిద్యార్థిని అనుమానాస్పద మృతి..
- MLA Arava Sridhar: ఎమ్మెల్యే శ్రీధర్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్.. ఇంకో వీడియో రిలీజ్ చేసిన బాధితురాలు..
- Crime news: పెళ్లి పేరుతో రప్పిస్తాడు.. ఆభరణాలతో ఉడాయిస్తాడు
- అనంతలో దారుణం – ప్రాణభయంతో కుమారుడిని చంపిన తండ్రి




