April 19, 2025
SGSTV NEWS
CrimeNational

అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా గొలుసు లాక్కెళ్లాడు – బెంగుళూరులో ఘటన, షాకింగ్ వీడియో

బెంగుళూరులో సోమవారం షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.  గుడిలో అమ్మవారి శ్లోకాలు చదువుతుండగా ఓ మహిళ మెడలో నుంచి దుండగుడు బంగారు గొలుసు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. బెంగుళూరు (Bengaluru) మహాలక్ష్మి లేఔట్, శంకర్ నగర్‌లోని గణేష్ ఆలయంలో మహిళలంతా కలిసి అమ్మవారి శ్లోకాలు చదువుతున్నారు. ఈ క్రమంలో గుడిలో కిటికీ పక్కన కూర్చుని శ్లోకాలు చదువుతున్న ఓ మహిళ మెడలో నుంచి బంగారు గొలుసును ఓ దుండగుడు లాక్కెళ్లాడు. ఆమె తేరుకునే లోపే అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనతో అక్కడ ఉన్న మహిళలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


Also read

Related posts

Share via