విజయనగరం: రఘు ఇంజినీరింగ్ కళాశాలలో తీవ్ర కలకలం రేపిన సంఘటన చోటుచేసుకుంది. ఒక విద్యార్థిని తన ఫోన్‌ను టీచర్ తీసుకున్నారన్న కారణంగా ఆగ్రహంతో స్పందించి, టీచర్‌ను బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దృశ్యం వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.
ఈ సంఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన మహిళా ఫ్యాకల్టీ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తోటి అధ్యాపకులు ఆమెను కుదుర్చేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆమె నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఆమె తన రాజీనామా పత్రాన్ని అధికారికంగా కళాశాల మేనేజ్మెంట్‌కు సమర్పించినట్టు సమాచారం.
ఈ నేపథ్యంలో, రఘు విద్యా సంస్థల చైర్మన్ రఘు సదరు ఫ్యాకల్టీలతో ప్రత్యేక సమావేశం నిర్వహించినట్టు తెలిసింది. ఈ సమావేశంలో ఫ్యాకల్టీ భద్రత, విద్యార్థుల ప్రవర్తనపై చర్చ జరిగిందని సమాచారం.
ఇదిలా ఉండగా, వివాదాస్పదంగా వ్యవహరించిన విద్యార్థిని తల్లిదండ్రులను కళాశాల వర్గాలు పిలిచినప్పటికీ, వారు ఇప్పటి వరకు హాజరు కాలేదన్నది గమనార్హం. ఈ వ్యవహారంపై మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని విద్యార్థుల సంఘాలు, టీచర్ల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.
Also Read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025