November 21, 2024
SGSTV NEWS
CrimeTelangana

తండ్రి కారణంగా పెళ్లి కావడం లేదని కడతేర్చిన తనయుడు



తండ్రి తీరుతో తనకు పెళ్లి కావడం లేదన్న కక్షకు తోడు.. ఆస్తి దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో కుమారుడు ఆయన్ను కిరాతకంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసింది.


అనారోగ్యంతో చనిపోయినట్లుగా చిత్రీకరణకు యత్నం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా గాయాలను గుర్తించిన బంధువులు

నవీపేట, న్యూస్టుడే: తండ్రి తీరుతో తనకు పెళ్లి కావడం లేదన్న కక్షకు తోడు.. ఆస్తి దక్కించుకోవాలన్న దుర్బుద్ధితో కుమారుడు ఆయన్ను కిరాతకంగా హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం అనంతగిరిలో సోమవారం తెల్లవారుజామున వెలుగు చూసింది.

నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ సతీష్కుమార్, ఎస్సై  వినయ్, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం..  గ్రామానికి చెందిన గౌరు అమృతం(54) పారిశుద్ధ్య  కార్మికుడిగా పని చేసేవారు. ఆయనకు కుమారులు  మహిపాల్, మనోజ్ ఉన్నారు. కుటుంబ కలహాలతో భార్య  చాలా ఏళ్ల క్రితమే పిల్లలతో సహా ఇంటి నుంచి వెళ్లిపోయి  మాక్లూర్ మండలం గొట్టుముక్కులలో ఉంటున్నారు.  కుమారులిద్దరూ బతుకుదెరువు నిమిత్తం కొంతకాలం కిందట దుబాయ్ వెళ్లారు. పెద్దకుమారుడు మహిపాల్ తన తండ్రి చనిపోయాడని దుబాయ్లో పని చేస్తున్న చోట అబద్ధం చెప్పి పది రోజుల కిందట అనంతగిరికి వెళ్లి తండ్రి వద్దే ఉంటున్నాడు. ఆదివారం రాత్రి ఇద్దరూ ఇంట్లోనే మద్యం తాగారు. ఈ క్రమంలో మత్తులో ఉన్న అమృతం మెడకు టవల్ బిగించి హత్య చేశాడు. సోమవారం ఉదయం ఏమీ తెలియనట్లుగా ఓ ఆర్ఎంపీని ఇంటికి రప్పించి ఆరోగ్యం బాగోలేక తన తండ్రి చనిపోయాడని చెప్పాడు. గ్రామస్థులకూ అదే చెప్పి నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు. మృతదేహానికి స్నానం చేయిస్తుండగా మెడకున్న గాయాలను అమృతం సోదరి, బంధువులు గుర్తించి అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకుని మహిపాల్ను విచారించగా తానే హతమార్చినట్లు అంగీకరించాడు. ‘మా అమ్మతో వేరుపడటం, నిత్యం మద్యం తాగుతుండటం కారణంగానే నాకు పెళ్లి కావడం లేదని తండ్రి అమృతంపై కక్ష పెంచుకున్నాను. అలాగే అతని పేరిట ఉన్న ఇల్లు, ప్లాటు విక్రయించి తల్లి పేరిట అనంతగిరిలో ఇల్లు కట్టాలన్న ఉద్దేశంతో హత్య చేశాను’ అని చెప్పాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Also read

Related posts

Share via