Viral Video: ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి గూడ్స్ రైలులో దాడుగుమూతల ఆట ఆడాడు. ఎవరికి దొరకుండా ఆ పిల్లవాడు గూడ్స్ రైలు కింద దాక్కున్నారు. తన స్నేహితులు ఎంత వెతికినా.. ఆ పిల్లవాడి మాత్రం అసలూ దొరకలేదు. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడాడని అనుకున్నారు కాదా ? ’నేను ఎవరికి దొరకవద్దు’ ఆలోచనే ఆ పిల్లవాడ్ని ప్రమాదంలోకి నెట్టింది. ఇంతకీ ఏం జరిగిందని అనుకుంటున్నారా? తెలుసుకోవాలంటే.. ఈ కథనంపై లూక్కేయండి.
Viral Video: పిల్లలకు ఆటలంటే చాలా ఇష్టం. తమ స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి పరుగు తీస్తుంటారు. అలా ఓ సారి ఆటలో మునిగిపోయారా.. ఇక వారికి ప్రపంచమే గుర్తుండదు. అన్నమే గుర్తుకురాదు. సమయమూ తెలియదు. అలా ఓ బాలుడు తన స్నేహితులతో కలిసి గూడ్స్ రైలులో దాడుగుమూతల ఆట ఆడాడు. ఆ పిల్లవాడు ఎవరికి దొరకుండా గూడ్స్ రైలు కింద దాక్కున్నారు. తన స్నేహితులు ఎంత వెతికినా ఆ పిల్లవాడి మాత్రం అసలూ దొరకలేదు. ఆ పిల్లవాడు చాలా బాగా ఆడాడు అని అనుకున్నారు కాదా ?
‘నేను ఎవరికి దొరకవద్దు’ అనే ఆలోచనే ఆ పిల్లవాడ్ని ప్రమాదంలోకి నెట్టింది. ఆ చిన్నారి ఎవరికి దొరకూడదని ఏకంగా గూడ్స్ రైలు చక్రాల మధ్య గ్యాప్‌లో దాక్కున్నాడు. అంతలోనే ఆకస్మాత్తుగా రైలు ప్రారంభం కావడంతో రైలు నుంచి దిగకుండా ఆ బాలుడు గూడ్స్ రైలు చక్రాల మధ్య గ్యాప్‌లో ఇర్కుపోయాడు. అలా ఆ పిల్లవాడు ఏకంగా వంద కిలోమీటర్లు ప్రయాణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్ అయ్యింది.
వివరాల్లోకెళ్తే.. ఆ పిల్లవాడిది లక్నోలోని అలంనగర్ రాజాజీపురంలోని బాలాజీ మందిర్. రైల్వే ట్రాక్ సమీపంలో ఉంటున్న ఆ పిల్లాడు.. తన స్నేహితులతో కలసి రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటూ.. అక్కడే ఆగి ఉన్న.. లక్నో నుంచి రోజా వెళ్తున్న గూడ్స్ రైలు ఎక్కాడు. అనంతరం గూడ్స్ రైలు ఆకస్మాత్తుగా కదలడంతో బాలుడు కిందకి దిగలేకపోయాడు. దీంతో రైలు చక్రాల మధ్యలో ఉండే చిన్నపాటి గ్యాప్‌లో ప్రమాదకర స్థితిలో కూర్చోని ఉండిపోయాడు. అలా ఆ రైలు ఉత్తరప్రదేశ్‌లోని హర్దోయ్ స్టేషన్ చేరింది.
ఈ క్రమంలోనే ఆర్పీఎఫ్ జవాన్ రైలును తనిఖీలు చేయగా బాలుడిని చూసి షాక్ అయ్యారు. ఈ సమాచారాన్ని హర్దోయ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్‌కు అందించారు. హర్దోయ్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలును ఆపడం ద్వారా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చిన్నారిని రక్షించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ద్వారా గూడ్స్ రైలు కంపార్ట్‌మెంట్ నుండి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.
ప్రమాదకర స్థితిలో ప్రయాణించడంతో ఆ చిన్నారి చాలా భయపడ్డాడు. చిన్నారి పేరు, చిరునామా అడిగి తెలుసుకున్న అనంతరం బాలల సంరక్షణ కేంద్రానికి అప్పగించారు. ఆ బాలుడు తన ఇంటికి దాదాపు వంద కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు. ఇప్పుడు ఆర్పీఎఫ్ జవాన్ గూడ్స్ రైలు చక్రాల మధ్య నుంచి ఓ చిన్నారిని బయటకు తీస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆ బాలుడిని గుర్తించిన రైల్వే సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
Also read
- Mahabubnagar: ఛీ ఛీ.. మధ్యాహ్న భోజనం పప్పులో కప్ప.. పరుగులు తీసిన స్టూడెంట్స్
- Telangana: భార్య కామం.. మంత్రగాడి మోహం.. కట్ చేస్తే, భర్తను ఎలా లేపేశారో తెలుసా..?
- Vijayawada: ఉదయాన్నే జిమ్‌లో చాటుమాటు యవ్వారం.. పోలీసుల ఎంట్రీతో సీన్ సితారయ్యింది..
- Hyderabad: ఫామ్‌హౌస్‌లో 8 మంది మహిళలు, 23 మంది పురుషులు.. అర్థరాత్రి వేరే లెవల్ సీన్.. చివరకు
- Lawyer Kissing video: లైవ్‌లో మహిళకు లాయర్ ముద్దులు – కోర్టు మొత్తం షాక్