నెల్లూరు : సిపిఎం నాయకులు పెంచలయ్య దారుణ హత్యను మరువక ముందే నెల్లూరులో రౌడీ మూకలు రెచ్చిపోయారు. ఓ ప్రయివేటు బస్సు డ్రైవర్, క్లీనర్‌పై కత్తులతో దాడి చేశారు. ఈ సంఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని గాంధీనగర్‌కు చెందిన మన్సూర్, ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామానికి చెందిన సలాం ఇద్దరూ నగరంలోని ఓ ప్రయివేటు సిటీ బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం సాయంత్రం వారు నెల్లూరు ఆర్టిసి సెంటర్ నుంచి అలీపురానికి బయలుదేరారు. ఈ క్రమంలో బోసుబొమ్మ సమీపంలోని బాబు ఐస్‌క్రీమ్ సెంటర్ వద్ద బస్సును ఓవర్ టేక్ చేసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ముగ్గురు యువకులు ప్రయత్నించారు. ట్రాఫిక్ కారణంగా డ్రైవర్ సైడ్ ఇవ్వలేదు. తర్వాత ద్విచక్రవాహనం అడ్డుపెట్టి బస్సును నిలిపివేశారు. ద్విచక్రవాహనదారులకు మరో ముగ్గురు జతయ్యారు. ఐదుగురు కలిసి బస్సులోకి వెళ్లారు. సైడ్ ఎందుకు ఇవ్వలేదంటూ క్లీనర్ సలాంతో ఘర్షణకు దిగి కత్తులతో దాడికి తెగపడ్డారు. అడ్డుకొనే ప్రయత్నంలో డ్రైవర్ మన్సూర్‌పై దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్, డ్రైవర్‌ను జిజిహెచ్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు
Also Read
- ఫిల్మ్ నగర్ లో కలకలం.. నటుడి ఇంట్లోకి దూసుకెళ్లిన కారు!
- ‘నా ముందే అలా చేస్తావా?’ రోకలిబండతో భర్త హత్య!
- ‘నా బిడ్డను కాపాడండి..’
- భార్య కళ్లెదుటే.. భర్త, అతడి ప్రియురాలు ఆత్మహత్య!
- తిరుపతిలో జంట హత్యలు..వెంటాడి వేటాడి నరికి చంపిన దుండగులు





