బైరెడ్డిపల్లి (చిత్తూరు) : రోడ్డు చదును యంత్రం నిద్రిస్తున్న ఇద్దరు యువకులపై ఎక్కడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన శుక్రవారం చిత్తూరు జిల్లాలోని బైరెడ్డిపల్లి మండలంలో తీర్థం గ్రామ సమీపాన ఉన్న బెంగళూరు టు చెన్నై హైవే రోడ్డులో జరిగింది. రాత్రి కాపలా కాస్త కొంతసేపు కునుకు తీద్దామని నిద్రిస్తున్న 1 అషరఫ్ 2 సాదిక్ అనే యువకులపై డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా చదును యంత్రం ఎక్కడంతో ఆ యువకులిద్దరూ మరణించారు. ఆ ఇద్దరూ తీర్థం గ్రామానికి చెందినవారు. ఆ ఇద్దరు రోడ్డు పనులు చేస్తున్న వాహనాలకు రాత్రిపూట కాపలా కాస్తూ ఉండేవారు. వారికి నెలకు రూ.11,000 ఇస్తున్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలియజేశారు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకొని వారిని చూసి శోకసంద్రంలో మునిగారు. రోడ్ రోలర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల రెండు ప్రాణలు పోయాయని ఇలాంటి సంఘటనలు రోడ్డు పనులు పూర్తయినంతవరకు జరగకుండా చూసుకునేలా చర్యలు తీసుకోవాలని అక్కడికొచ్చిన ప్రజలు పేపర్ ప్రతినిధులకు తెలుపుతూ ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దఅష్టిలో ఉంచుకొని చర్యలు చేపట్టాలని ప్రజలు కోరారు. ఇది తెలుసుకున్న సీఐ మురళీమోహన్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మఅతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలియజేశారు
Also read
- Akshaya Tritiya 2025: అక్షయ తృతీయ రోజున బంగారమే కొనాల్సిన పనిలేదు.. వీటిని కొన్నా లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం..
- తులసి దగ్గర నెయ్యి దీపం పెట్టండి.. లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది..!
- నేటి జాతకము 18 ఏప్రిల్, 2025
- పరారీలో అఘోరి, శ్రీ వర్షిణి.. ఫోన్లు స్విచ్చాఫ్- ఆ భయంతోనే జంప్!
- విహారయాత్రలో విషాదం – విద్యార్ధి మృతి