ఊరిలో తెలిసిన మహిళకు ఆశ్రయం ఇచ్చిన యువకునికి అనుకోని ఇబ్బంది ఎదురైంది. ఆమె కుటుంబ కారణాలతో ఆ యువకుని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటంతో తన పరువు పోతుందని తెలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
ఊరిలో తెలిసిన మహిళకు ఆశ్రయం ఇచ్చిన యువకునికి అనుకోని ఇబ్బంది ఎదురైంది. ఆమె కుటుంబ కారణాలతో ఆ యువకుని ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడటం(suicide-attempt) తో తన పరువు పోతుందని తెలిసి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాల ప్రకారం మహబూబాబాద్ జిల్లాలోని రెడ్యాల గ్రామానికి చెందిన వివాహిత మహిళ(38) కు భర్తతో పాటు కొడుకు, కూతురు ఉన్నారు. అయితే ఆమె మూడేళ్ల కుమారుడికి ఆరోగ్యం భాగలేకపోవడంతో ఆస్పత్రి చికిత్స చేపిస్తానని చెప్పి కుమారుడిని తీసుకుని హైదరాబాద్‌కు వచ్చింది. ఈ క్రమంలో తమ గ్రామానికి చెందిన బానోత్ అనిల్ నాయక్ అనే యువకునితో పరిచయం ఉండటం అతను హైదరాబాద్ నాగోలులోని అంధుల కాలనీలో ఉండటంతో ఈ నెల 20న అతని వద్దకు వచ్చింది. మరునాడు రాత్రి వరకు కూడా అనిల్ వద్దే ఉంది.
అయితే అదే రోజు అనిల్ కూరగాయలు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చేసరికి ఆ మహిళ బాత్రూంలోకి వెళ్లింది, అయితే స్నానం చేస్తుందని మొదట భావించినప్పటికీ ఎంతసేపటికి రాకపోవడంతో తలుపుతీయమని చాలాసేపు బతిమిలాడాడు. అయితే అనుమానం వచ్చి బాత్రూం వెంటిలేటర్ నుంచి చూడగా ఆమె ఉరివేసుకోవడం కనిపించింది. గమనించిన అనిల్ చుట్టుపక్కల వారికి తెలిస్తే తన పరువు పోతుందని భయపడ్డాడు. ఇతరుల సాయం కోరకుండా తనే తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్లాడు. కానీ అప్పటికే ఆమె ఉరి బిగించుకుని మరణించింది. దీంతో ఊరిలో తెలిస్తే తలెత్తుకోలేనని భావించిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకునేందుకు చేయి కోసుకున్నాడు, అయితే ఆ సమయంలోనే ఎదురుగా మృతురాలి మూడేళ్ల కొడుకు ఏడుస్తూ కనిపించేప్పటికీ ఏం చేయాలో తెలియక ఆ బాబును తీసుకుని చేతికి దస్తీ కట్టుకుని పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయం అంతా పోలీసులకు చెప్పడంతో ఇన్‌స్పెక్టర్ మక్బూల్‌జానీ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే విషయం తెలిసి మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. నాగోలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న వారు ఆమె మరణానికి కారణమైన అనిల్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని న్యాయం చేస్తామని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
Also read
- Andhra: ఇద్దరు వ్యక్తులు, 8 చికెన్ బిర్యానీ ప్యాకెట్లు.. హాస్టల్ గోడ దూకి.. సీన్ కట్ చేస్తే.!
- Andhra: ఏడాదిన్నరగా తగ్గని కాలినొప్పి.. స్కానింగ్ చేయగా తుని హాస్పిటల్లో అసలు విషయం తేలింది
- పెళ్లిలో వధువు రూమ్ దగ్గర తచ్చాడుతూ కనిపించిన ఇద్దరు వ్యక్తులు.. కట్ చేస్తే.. ఒక్కసారిగా అలజడి..
- Andhra: నెల్లూరునే గజగజ వణికించేసిందిగా..! పద్దతికి చీర కట్టినట్టుగా ఉందనుకుంటే పప్పులో కాలేస్తారు
- గుడిలో ప్రసాదంగా పిజ్జా, పానీపూరి.. కారణం తెలిస్తే అవాక్కే.. ఎక్కడ ఉన్నాయో తెలుసా..?





