Tamil Nadu Crime News: ఇటీవల కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తున్నారు. తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడటం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు.
ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్రంగా స్పందిస్తూ మనస్థాపానికి గురవుతున్నారు. ఆ సమయంలో తాము ఏం చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎదుటి వారిపై దాడులకు తెగబడటం, హత్యలు చేయడం లాంటివి చేస్తున్నారు. చాలా వరకు ప్రేమ వ్యవహారాలు, ఆర్ధిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల కారణంగా మనస్థాపానికి గురైన వారు ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పపడుతున్నారు. తమిళనాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రేమోన్మాది కత్తితో ఉపాధ్యాయురాలిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
తంజావూర్ జిల్లా మల్లిపట్టణం ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఉపాధ్యాయురాలు రమణి(26) ఉదయం పాఠశాల తరగతి గదిలో పాఠాలు చెబుతుండగా హత్యకు గురైంది. రమణిని తోటి ఉపాధ్యాయులు ఉన్మాది నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఇటీవల రమణి, చిన్నమనై గ్రామానికి చెందిన మదన్‌కుమార్(28) కుటుంబ సభ్యులు పెళ్లి కోసం చర్చలు జరుపుకున్నారు. అయితే రమణికి మాత్రం పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఈ క్రమంలోనే మదన్ తో పెళ్లి ప్రపోజల్‌ను నిరాకరించింది. తనతో రమణి పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు మదన్. కొన్నిరోజలుగా సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు మదన్. ఈ క్రమంలోనే రమణి స్కూల్ కి వెళ్లే సమయంలో ఆమెను ఫాలో అయ్యాడు. క్లాస్ లో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్న సమయంలో ఆమెపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ రమణి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిపోయింది.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు టీచర్ రమణిని హత్య చేసిన మదన్‌ను విచారిస్తున్నారు. హత్యకు గురైన టీచర్ రమణి 4 నెలల క్రితమే ఉద్యోగంలో చేరినట్లు సమాచారం. ఈ సంఘటన గురించి సహ ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. రమణి టీచర్ చాలా మృదు స్వభావి. పిల్లలతో స్నేహపూర్వకంగా ఉంటారు. అందుకే రమణి టీచర్ అంటే పిల్లకు కూడా ఎంతో ఇష్టం. అలాంటిది ఆ ప్రేమోన్మాది హఠాత్తుగా క్లాస్ రూమ్ లోకి చొరబడి కత్తితో పొడవడంతో పిల్లలు కేకలు వేశారు. వెంటనే ఏం జరిగిందని మేం క్లాస్ రూమ్ లోకి వెళ్లాం.. అతన్ని ఆపడానికి ప్రయత్నించాం. కానీ ఆ ఉన్మాది మాపై కూడా కత్తి దూశాడు.. ఎలాగో అలా అతన్ని పట్టుకున్నాం. అప్పటికే రమని మేడం తీవ్రంగా గాయపడింది. దుండగుడు ఆమె మెడపై బలంగా పొడిచాడు.. దాంతో తీవ్ర రక్తస్రావం అయింది. అంబులెన్స్ లో హాస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలో ఆమె కన్నముసిందని కన్నీరు పెట్టుకున్నారు. ఈ ఘటనతో పాఠశాలలో విద్యార్థులు ఒక్కసారిగా భయపడిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని మదన్ ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





