దుమ్ముగూడెం, : మూసేసిన పాఠశాలను తిరిగి తెరిపించారని ఛత్తీస్ గఢ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని మావోయిస్టులు హత్య చేశారు. సుక్మా జిల్లా గోండ్పల్లికి చెందిన ఉపాధ్యాయుడు దూది అర్జున్(35) ఇంట్లో నిద్రిస్తుండగా ఆదివారం కొందరు మావోయిస్టులు అపహరించారు. సమీప అటవీప్రాంతంలో ఆదివాసీల సమక్షంలో ప్రజాకోర్టు నిర్వహించి ఆయనపై పలు ఆరోపణలు చేశారు. మావోయిస్టులు కొంతకాలం కిందట గ్రామస్థులను బెదిరించి ప్రభుత్వ పాఠశాలను మూసివేయించారు. అధికారుల సహాయంతో ఇటీవల పాఠశాలను తిరిగి ప్రారంభించడంలో ఉపాధ్యాయుడు అర్జున్ ప్రముఖపాత్ర పోషించారు. దీంతో ఆగ్రహించిన మావోయిస్టులు ప్రజాకోర్టులో కర్రలతో కొట్టి.. హత్య చేసి మృతదేహాన్ని గ్రామ శివారులో పడేశారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025