June 29, 2024
SGSTV NEWS
Andhra Pradesh

సామాన్యులకు అందుబాటులో లేని ప్రభుత్వ ఆసుపత్రి…… గ్రీష్మ కుమార్, ఐ.యఫ్.టి.యు.


      నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఐ.యఫ్.టి.యు ఆధ్వర్యంలో సౌకర్యాలు మెరుగు పరచాలనీ, సిబ్బంది ని పెంచాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నా.
      ధర్నా సందర్భంగా ఐ.యఫ్.టి.యు జిల్లా సహాయ కార్యదర్శి ఈమని గ్రీష్మ కుమార్ మాట్లాడుతూ ఇటీవల ఇందిరా నగర్, బసివి రెడ్డి పేటల కు చెందిన ఇద్దరు కార్మికులు జ్వరం కారణంగా ఆసుపత్రికి వెళ్ళగా ప్రాధమిక వైద్యం అనంతరం వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి కి , అక్కడినుంచి ఒకరిని కాకినాడ రిఫర్ చేయగా ఒకరు మార్గం మధ్యలోనే మరణించారని, నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి గీతం కంటే ప్రస్తుతం కొంత మెరుగైన ప్పటికినీ స్కానింగ్ వంటి అధునాతన వైద్య పరికరాలు, నిత్యం 200 పైగా వుండే ఆసుపత్రి ఓ.పికి , కొత్త కొత్త రోగాలకు తగ్గట్టు గా నిష్ణాతులైన (స్పెషలిస్ట్ లు) డాక్టర్ లు మరియు సిబ్బంది ని నియామకం చేయాలని డిమాండ్ చేశారు.  నిడదవోలు పరిసర ప్రాంతాల నుంచి 30 కి పైగా గ్రామాలనుండి వచ్చే రోగులకు నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రి కి వేస్తే తమ ప్రాణాలు దక్కుతాయనే భరోసా కల్పించాల్సిన బాధ్యత పాలకులనీ అలా కాకుండా ఇతర ప్రాంతాల రిఫర్ చేసే విధానానికి స్వస్తి పలికి కేవలం భవంతులు, పడకలు పెంచి ఊరుకోవడం సరికాదని, ఆసుపత్రి స్థాయిని పెంచి నిడదవోలు ను రాష్ట్ర స్థాయి లో అగ్రగామిగా నిలుపుతామన్న నూతన ప్రభుత్వ హామీని నిలబెట్టుకోవాలని నూతన యం.యల్.ఏ శ్రీ కందుల దుర్గేష్ గారిని కోరారు.
        అభ్యుదయ పెయింటర్స్ & ఆర్టిస్ట్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు రవ్వ సురేష్ కుమార్ మాట్లాడుతూ గతంలో భవన నిర్మాణ కార్మికులు చనిపోతే కార్మిక సంక్షేమ మండలి నిధుల నుండి 2 లక్షల రూపాయలు సహజ మరణం భీమా వచ్చేదని ప్రస్తుతం నిధులు లేక ఆ బోర్డు నిర్వీర్యం అయ్యి కార్మిక కుటుంబాలు రోడ్డున పడుతున్నారన్నారు. తక్షణమే సదరు బోర్డు ను పునరుద్ధరించాలని కోరారు.
       ఐ.యఫ్.టి.యు నాయకులు యల్లమిల్లి వరప్రసాద్ మాట్లాడుతూ అంతరిక్షాన్ని వెళ్ళగలుగుతున్న మానవుడు భూమి మీద వచ్చే డెంగ్యూ, మలేరియా, ప్లేట్ రెట్లు పడిపోవటం వంటి ప్రమాదకరమైన రోగాలతో ప్రాణాలు కోల్పోతున్నారు న్నారు. అదేవిధంగా నిత్యం అభివృద్ధి గురించి మాట్లాడే పాలకులు ప్రాణాలు నిలబెట్టే ఆసుపత్రి లను అభివృద్ధి చేస్కో లేకపోవడం శోచనీయమన్నారు.
       పై కార్యక్రమంలో యూనియన్ ప్రెసిడెంట్ నూతంగి రమేష్, ఇఫ్టూ జిల్లా కమిటీ సభ్యులు తీపర్తి వీర్రాజు, చైతన్య, గుంటు రాజీవ్ , జగదీష్,యాదాల ప్రసన్న, యెమిలి కార్తీక్, గుంటు సూరిబాబు, తదితరులు పాల్గొన్నారు.

Also read

Related posts

Share via