March 16, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Child Trafficking : పసికందులను విక్రయించే ముఠా అరెస్ట్‌


అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా కాలేదు.. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లిఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారులను ఏకంగా దళారులు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజుల వయసు కూడా నిండని పిల్లలను విక్రయిస్తున్న ముఠాగుట్టును విజయవాడ పోలీసులు రట్టుచేశారు

Child Trafficking: అమ్మ కడుపు నుంచి బయటకొచ్చి రోజులు కూడా కాలేదు.. ఆ పసికందులు అంగడి సరుకయ్యారు. తల్లిఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారులను ఏకంగా దళారులు అమ్మేస్తున్నారు. నాలుగైదు రోజుల వయసు కూడా నిండని పిల్లలను విక్రయిస్తున్న ముఠాగుట్టును విజయవాడ పోలీసులు రట్టుచేశారు. ఆస్పత్రులలో పసి కందులను ఎత్తుకెళ్లి అమ్ముకునే ముఠాను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్, పోలీసు టీం సంయుక్తంగా ఈ కీలక కేసు  మిస్టరీ ని చేధించినట్లు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ముఠా సభ్యులైన సరోజిని, షేక్ ఫరీనా, షైదా బీ, కరుణ శ్రీ, శిరీష లను అరెస్టు చేసినట్లు తెలిపారు.

నిందితులనుంచి ముగ్గురు పసికందులను తీసుకొచ్చి కన్న తల్లులకు అప్పగించినట్లు వెల్లడించారు. సరోజిని ఇప్పటి వరకు ఏడుగురు పసి కందులను  అమ్మినట్లు గుర్తించామని రాజశేఖర్‌ బాబు తెలిపారు. వారిలో ముగ్గురిని గుర్తించి పసికందులను తీసుకొచ్చామన్నారు. జైలులో విజయలక్ష్మి, సరోజినిలకు పరిచయం ఏర్పడిందని తద్వారా ఈ అమ్మకాలు చేపట్టినట్లు సీపీ తెలిపారు. పసికందులను లక్ష నుంచి మూడు లక్షల రూపాయలకు అమ్ముతున్నారని గుర్తించామన్నారు. అరెస్టు చేసిన సమయంలో వారి నుంచి నాలుగు లక్షలు స్వాధీనం చేసుకున్నామన్నారు

భేటీ కిరణ్, అనిల్ అనే నార్త్ ఇండియన్స్ కి వారు  బిడ్డలను అమ్మినట్లు గుర్తించామన్నారు. ఢిల్లీ, అహ్మదాబాద్ లో పిల్లలను అమ్మినట్లు గుర్తించామని తెలిపారు. సరోజినికి మొదటి నుంచీ క్రిమినల్ హిస్టరీ ఉందన్న సీపీ. చదివింది ఏడో తరగతి అయినా దొంగతనాల్లో ఆరి తేరిందని తెలిపారు. గతంలో‌ కూడా  వారి పై అనేక కేసులు ఉన్నాయని,ఈ గ్యాంగ్ లో ఏడుగురు కీలక‌పాత్రధారులుగా ఉన్నారని సీపీ వివరించారు. ఐదుగురిని ఇప్పటి వరకు అరెస్టు చేశామని, త్వరలో మిగిలిన వారిని కూడా అరెస్టు చేసి.. ఈ పసి కందుల విక్రయాల వివరాలు పూర్తిగా అందిస్తామన్నారు. ఈ సందర్భంగా కేసును చేధించిన లతా రాయ్ ల, స్రవంతి టీం లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Also read

Related posts

Share via