AP Crime: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న లోతు గడ్డ జంక్షన్ టేకుల తోట వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టడంలో అసలు విషయం తెలిసింది. మృతుడు రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ (50)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిసింది.
రాజమండ్రికి చెందిన ఇద్దరు నిందితులు వెంకటేష్, పుష్ప రాజ్లను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి నుంచి ముగ్గురు స్నేహితులు లోతు గడ్డ జంక్షన్కు వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. లోతు గడ్డ జంక్షన్ వద్ద మద్యం సేవించి ముగ్గురిలో ఒకరైన పుష్పరాజును అర్జున్ కులం పేరుతో దూషించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేష్, పుష్ప రాజ్లు ఇద్దరు కలిసి అర్జున్ను చింతలూరు సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి అర్జున్ ను రాయితో మోది హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
Also read
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?
- దారుణం.. విషం తాగి ఫ్యామిలీ మాస్ సూసైడ్! ముగ్గురు మృతి
- Crime News: ఎవడు మమ్మీ వీడు.. ప్రేయసి ముక్కు కోసి ఎత్తుకెళ్లిన ప్రియుడు.. ఎందుకో తెలిస్తే
- Medak: ప్రేమ పెళ్లి.. పేరెంట్స్ను కౌన్సిలింగ్కు పిలిచిన పోలీసులు.. ఆపై ఊహించని సీన్..





