వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
మేడ్చల్ జిల్లా జవహర్ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. వాటర్ హీటర్ బకెట్లో పడి నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్లి హీటర్ బకెట్లో పడ్డాడు. వేడినీళ్లలో పడిపోవడంతో బాలుడి ఒళ్లంతా తీవ్ర గాయాలయ్యాయి. అయితే గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూనే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భార్య సుమలత, ఇద్దరు కుమారులతో కాటి నర్సింహా అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు
పిల్లల్ని చూసేందుకు సుమలత తల్లి
అయితే ఇటీవల పిల్లల్ని చూసేందుకు సుమలత తల్లి పుల్లమ్మ ఇంటికి వచ్చింది. వారి ఇంటి సమీపంలోనే ఉండే నర్సింహ సోదరుడు సాయి ఇంటికి తన మనుమడు బన్నీ(4)ని తీసుకొని వెళ్లింది. అయితే అక్కడ స్నానానికి వేడి నీళ్లు పెట్టిన సాయి కుటుంబసభ్యులు హీటర్ తీసి బకెట్‌ను అక్కడే ఉంచేశారు. పుల్లమ్మతో మాటల్లో పడిపోయి బన్నీని పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆడుకుంటున్న బన్నీ పొరపాటున వేడి నీటి బకెట్‌లో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. కాసేపటికే గమనించిన కుటుంబసభ్యులు బకెట్‌లో నుంచి వెంటనే బన్నీని బయటకు తీశారు. అప్పటికే ఆ నాలుగేళ్ల బాలుడు ఛాతీ భాగం కాలిపోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన ఫలితం లేకుండా పోయింది. చిన్నారి మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికంగా ఈ ఘటన అందర్నీ కలిచివేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్‌కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో





