SGSTV NEWS online
Andhra PradeshCrime

నూజివీడులో వైన్ షాపు విషయంలో రగడ. Viral video

ఏలూరు జిల్లా, నూజివీడు:



మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న బాలాజీ వైన్స్ పార్టనర్స్ మధ్య చెలరేగిన వాటాల  వివాదం.

వైన్ షాపు రెన్యువల్ అయిన తర్వాత పార్టనర్ లకు వాటా ఇవ్వలేదని, వైన్ షాపు వద్ద ఘర్షణకు దిగిన వైనం.

మిద్దె రాణి పేరుతో బాలాజీ వైన్స్ ఉండగా, మరికొంత మందిని కలుపుకుని గత రెండు సంవత్సరాలు మద్యం దుకాణాన్ని నడిపిన నిర్వాహకులు.

తమకు రావలసిన వాటా లాభాలను ఇవ్వకుండా, ఇప్పుడు వైన్ షాపును మిద్దె రాణి భర్త లక్ష్మణ్ ఒక్కరే షాపును రెన్యువల్ చేసుకున్నామని, ఎవ్వరికి వాటాలు లేవని చెప్పడంతో వివాదం మొదలయిందని చెబుతున్న బాధితుడు శ్రీకాంత్.

బాలాజీ వైన్స్ యజమాని రాణి మాట్లాడుతూ… గతంలో మా షాపులో ఇద్దరు వ్యక్తులకు వాటా ఇచ్చామని, వారికి ఇవ్వవలసిన నగదును మొత్తం వాయిదాల రూపంలో చెల్లించామని చెబుతున్న షాపు యజమాని మిద్దె రాణి.

శ్రీకాంత్, మరో వాటా దారునికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాల్సి ఉందని, ఈలోగా షాపు రెన్యువల్ చేయించుకోవడంతో నగదు చెల్లించడంలో జాప్యం అయిందన్న యజమాని రాణి.

వైన్ షాపు వద్దకు శ్రీకాంత్, అడపా నాగేశ్వరరావు అనే వ్యక్తులు వారి అనుచరులతో వచ్చి మాపై దౌర్జన్యం చేశారని ఆరోపిస్తున్న వైన్ షాపు క్యాషియర్, యజమాని రాణి.

తమకు రావలసిన వాటా లాభాల నగదును మొత్తం పూర్తిగా మాకు చెల్లించలేదని ఆరోపిస్తున్న బాధితులు.


మొదటి నుండి షాపులో పార్టనర్స్ గా ఉన్నామని, షాపు రెన్యువల్ చేసిన తర్వాత మమ్మల్ని మీకు ఈ షాపుకు సంబంధం లేదని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్న బాధితులు.

Also read

Related posts