పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తల త్యాగాలకు మీ దగ్గర విలువ ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల కమిషన్లో నాన్జ్యుడిషియల్ సభ్యుడిగా ఒక సామాజిక కార్యకర్తకు అవకాశం కల్పించే సందర్భంలో, తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్తలు మీ నాయకత్వానికి గుర్తుకు రాలేదా?
గతంలో వైసీపీతో సంబంధం ఉన్న వ్యక్తికి ఈ పదవిలో అవకాశం కల్పించారనే చర్చ పార్టీ శ్రేణుల్లో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడం తప్పు అని కాదు. కానీ, పార్టీ కోసం కష్టపడి, జెండా మోసి, ప్రజల్లో పార్టీని బలోపేతం చేసిన కార్యకర్తల సేవలను కూడా గుర్తించాల్సిన బాధ్యత మీ నాయకత్వంపై లేదా?
పార్టీ కోసం పనిచేసిన వారికి ఇక ఎప్పటికీ పదవులు రావా? ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే మీరు ప్రాధాన్యమా?
ఇలాంటి తమరి నియామకాలు పార్టీ కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలకు ఎలాంటి సంకేతాన్ని ఇస్తాయి? భవిష్యత్తులో పార్టీ కోసం కష్టపడే వారికి ఇది ఎలాంటి సందేశం అవుతుంది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై ఆత్మపరిశీలన చేసుకోవాలి. పదవుల పంపిణీలో రాజకీయ సమీకరణాలతో పాటు, పార్టీ కోసం పనిచేసిన వారి సేవలకు కూడా తగిన గుర్తింపు ఇవ్వాలి.
అధికారం శాశ్వతం కాదు. కార్యకర్తల కష్టం, నిబద్ధత, విశ్వాసమే పార్టీకి పునాది. ఆ పునాదిని తమరు విస్మరించకూడదు!
— పార్టీ శ్రేయస్సును కోరుకునే ఒక కార్యకర్త ఆవేదన.
