SGSTV NEWS
CrimeTelangana

నీటి బకెట్లో పడి చిన్నారి మృతి

నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం లో జరిగింది

చిన్నాపూర్ (మోపాల్) : నీటి బకెట్లో పడి ఊపిరాడక 18 నెలల చిన్నారి స్నేహిత మృతిచెందింది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో జరిగింది. ఎస్ చ్వో గంగాధర్ తెలిపిన వివరాల ప్రకారం.. కోటగిరి మండలం పొతంగల్ గ్రామానికి చెందిన గంగాధర్, స్వరూపలకు ఇద్దరు కుమార్తెలు. స్వరూప.. భర్త, పిల్లలతో కలిసి బుధవారం మోపాల్ మండలం చిన్నాపూర్లోని సోదరి ఇంటికి వచ్చారు. శుక్రవారం ఉదయం స్నేహితను ఆడిస్తూ ఉండమని మూడేళ్ల పెద్ద కుమార్తెకు చెప్పి స్వరూప స్నానానికి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి నిండుగా నీళ్లు ఉన్న బకెట్లో స్నేహిత తలకిందులుగా కనిపించింది. ఆమెను బయటకు తీసి పెద్దగా కేకలు వేసింది. గమనించిన స్థానికులు చిన్నారి తాగిన నీళ్లను బయటకితీసే ప్రయత్నం చేసేలోపే చనిపోయింది.

Also read

Related posts