అమీర్‌పేట్ స్నాఫ్ చాట్‌లో పరిచయమైన బాలికను బెదిరించి లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఆర్ నగర్ పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అమీర్‌పేట సోనాబాయి ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న గణేష్ యాదవ్‌కు ఓ బాలిక(14)తో స్నాప్ చాట్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో రోజు సదరు బాలికతో తరచూ మాట్లాడుతుండేవాడు ఈ క్రమంలో ఆమె వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు సేకరించిన అతను వాటిని చూపి బెదిరించి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలియడంతో బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also read
- Texas: నెల రోజుల్లో ఇంటికి రావాల్సుంది..అంతలోనే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది!
- కొబ్బరిబొండాల కత్తితో ఇద్దరు కొడుకులను నరికి భవనం పై నుండి దూకి ఆత్మహత్య చేసుకున్న తల్లి
- పూజలో కలశం ప్రాముఖ్యత ఏమిటి? మామిడి ఆకులు, కొబ్బరికాయ ఎందుకు పెడతారో తెలుసా..
- Shukra Gochar 2025: మీనరాశిలో శుక్రుడు అడుగు.. మాలవ్య, లక్ష్మీనారాయణ యోగాలు .. మూడు రాశుల వారు పట్టిందల్లా బంగారమే..
- Jupiter Transit 2025: 12 ఏళ్ల తర్వాత బృహస్పతి మిథునరాశిలోకి అడుగు.. మొత్తం 12 రాశులపై ప్రభావం ఎలా ఉంటుంది? పరిహారాలు ఏమిటంటే