హిందూపురం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పట్టణానికి చెందిన సంపత్ కుమార్ దారుణ హత్యకు గురైన సంఘటన గురువారం ఉదయం ధర్మవరం చెరువు ప్రాంతంలో వెలుగు చూసింది. వివరాల మేరకు హిందూపురం పట్టణానికి చెందిన సంపత్ కుమార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఎన్ ఎస్ యు ఐ జాతీయ కార్యదర్శిగా, కేరళ రాష్ట్రం ఎన్ ఎస్ యూ ఐ ఇంచార్జ్ గా ఉన్నారు. యువ న్యాయవాదిగా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి వరకు హిందూపురం పట్టణంలో తన స్నేహితులతో కలిసి ఉన్న సంపత్ కుమార్ గురువారం ఉదయం ధర్మవరం చెరువు ప్రాంతంలో మృతదేహం లభ్యం కావడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై ధర్మవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025