నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. మద్యానికి బానిసైన భర్త కిరణ్‌పై అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న హత్య చేసి పరారయ్యాడు.
TG Crime: ఓ జంట రెండేళ్ల క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఇద్దరు సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఇద్దరి మధ్య గొడవలు రావటంతో మద్యానికి బానిసైయ్యాడు. దీంతో భర్త చెప్పిన మాట వినటం లేదని భార్య ఘర్షణ పడింది. గొడవ పెరిగి పెద్ద మనుషుల వరకు చేరింది. చివరికి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండలో కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం
దంపతుల మధ్య తరచూ గొడవలు..
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యానికి బానిసైన భర్త.. భార్య అరుణ(30)ను దారుణంగా గొంతుకోసి చంపాడు. తెరటిగూడెంలో మద్యానికి బానిసైన భర్త కిరణ్ గత కొంతకాలంగా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. భర్త కొంతకాలంగా బంధువుల ఇళ్లలో ఉంటున్నాడు. మళ్లీ ఇద్దరి మధ్య గొడవ జరగడంతో అరుణ పెద్ద మనుషులను పిలిచి పంచాయితీ పెట్టింది
దీంతో భార్యపై కోపం పెంచుకున్న కిరణ్.. అక్కడే అరుణను గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. అరుణ చనిపోవటంతో ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారని అనుకుంటే ఇలా ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాంట్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఘటన ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇద్దరు రెండేళ్ల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్నారని చెబుతున్నారు. భార్య అరుణ పెద్ద మనుషుల్లో కిరణ్‌ను తిట్టడం వల్లే క్షణికావేశంతో హత్య చేశాడని సాక్ష్యులు చెబుతున్నారు.
Also read
- సీతాదేవి తనువు చాలిస్తూ భూమిలో ఐక్యం అయిన ప్రదేశం ఎక్కడుందో తెలుసా..
- దైవ దర్శనకోసం వెళ్తే దారుణం.. ఆ రోజు రాత్రి ఏం జరిగిందంటే.. సంచలన విషయాలు..
- శ్రీ రామ నవమి పండగ విషయంలో గందరగోళం.. ఏప్రిల్ 5 లేదా 6 ఎప్పుడంటే
- మహిళల రుతు సమయం గురించి గరుడ పురాణం ఏం చెబుతుందో తెలుసా..?
- AP Crime: ఏపీలో దారుణం.. యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువతి!