March 13, 2025
SGSTV NEWS
CrimeTelangana

Online Betting: ఆన్‌లైన్ గేమ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలి.. ఫోన్‌కు ఫోరెన్సిక్ పరీక్ష!


ఆన్‌లైన్ గేమ్ బెట్టింగ్ మోసానికి 17 ఏళ్ల బాలుడు బలయ్యాడు. తమిళనాడులోని మధురైకి చెందిన హరిహరసుధన్ తమ బిల్డింగ్‌పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఫోన్‌ ఫోరెన్సిక్ పరీక్షకు పంపించి పలు కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Online Betting: ఆన్‌లైన్ గేమ్ బెట్టింగ్ బాలుడి ప్రాణం తీసింది. కొంతకాలంగా ఫోన్‌కు బానిసైన ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పిల్లవాడు నెమ్మదిగా ఆన్ లైన్ గేమ్ ఆడటం మొదలపెట్టాడు. అలా అప్పుల్లో కూరుకుపోవడంతోపాటు తీవ్ర ఒత్తిడికి లోనై చివరకు ఆత్మహత్య చేసుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటన తమిళనాడులోని మధురైలో జరగగా పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 

కాలేజీ మానేసి గేమ్ పై ఫోకస్..
తమిళనాడులోని మధురైలో నివాసం ఉంటున్న మణికంఠం కొడుకు 17 ఏళ్ల హరిహరసుధన్ 11వ తరగతి వరకు చదువు పూర్తి చేశాడు. అతను కొంతకాలంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడు. దాని కారణంగా మానసిక సమస్యలతో బాధపడుతూ సంవత్సర కాలంగా అతను కాలేజీకి వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉన్నాడు. అతను ఈ ఏడాది సమయమంతా ఈ గేమ్‌లను ఆడుతూ గడిపాడు. తల్లిదండ్రులు చెప్పినా వినకుండా దానిలో నిమగ్నమయ్యాడు. అలా డబ్బులు పొగొట్టుకున్న హరి.. అవమానంగా భావించి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో మొబైల్ వ్యసనమే దీనికి కారణమని భావిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

జాగ్రత్తగా చూసుకోమంటూ..
ఇక రెండు రోజుల క్రితం ఇంటి పైకప్పు నుండి పెద్ద శబ్దం వినబడగానే హరి పేరెంట్స్ ఉలిక్కిపడ్డారు. బటయకెళ్లి చూసేసరికి హరిహరసుధన్ తన ఫోన్ పగలగొట్టి పైకప్పు మీద నుండి దూకినట్లు గుర్తించినట్లు తెలిపారు. ఇక తన ప్రాణాలను తీసుకునే ముందు ఒక స్నేహితుడికి మెసేజ్ పంపాడు. ‘నా తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకో’ అని అతన్ని కోరాడు. తల్లిదండ్రులు చెప్పే పలు కారణాలను బట్టి అతను నిజంగా ఆన్‌లైన్ గేమ్‌లకు బానిసయ్యాడో లేక ఆత్మహత్య వేక ఇంకేదైన కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపించాం. ఈ కేసు విచారణ ప్రక్రియ 3-4 నెలలు పట్టవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి.

Also read

Related posts

Share via