ఆదిలాబాద్ పట్టణంలోని మావలా పీఎస్ పరిధిలోని ఓ కాలనీ నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత ఓ బాలికకు మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లింది. ఇద్దరు యువకులు అత్యాచారం చేశారు. మహిళతోపాటు బంధువు ఇమ్మోరల్‌పై పోక్సో, ట్రాఫిక్ యాక్ట్, అత్యాచారం కేసులు నమోదు చేశారు.
దేశంలో అమ్మాయిలపై అత్యాచారం ఘటన్లు రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు ఏ చట్టాలు తెచ్చినా.. వారిపై అఘాయిత్యాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజా మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లి ఇద్దరు యువకులు అత్యాచారం చేసిన ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. పన్నెండేళ్ల బాలికకు ఓ మహిళ మాయమాటలు చెప్పి అడవిలోకి తీసుకెళ్లింది.
అడవిలోకి తీసుకెళ్లి…
అక్కడ ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం ఆదిలాబాద్ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ పట్టణంలోని మావలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ కాలనీ నివాసం ఉంటున్న 35 ఏళ్ల వివాహిత.. పథకం ప్రకారం వచ్చింది. ఆదివారం మధ్యాహ్నం ఆ బాలికను సమీప అడవిలోకి తీసుకెళ్లింది.
ఆమెకు సంబంధించిన బంధువు ఇద్దరు యువకులను అక్కడికి వచ్చారు. తరువాత ఆ ఇద్దరు బాలిక పై అత్యాచారం చేశారు. రాత్రికి ఇంటికి తిరిగొచ్చిన బాలిక.. తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పటంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక విచారణ పూర్తి చేశారు. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు యువకులతోపాటు మహిళ బంధువు ఇమ్మోరల్ గుర్తించారు. వారిపై పోక్సో, ట్రాఫిక్ యాక్ట్, అత్యాచారం కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ చెప్పారు. అనంతరం బాలికకు పరీక్షల నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలిచారు. పిల్లలపై ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడే వారికి కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులకు డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Ratha Saptami 2026: దరిద్రం వదిలి ఐశ్వర్యం వస్తుంది!.. రథ సప్తమి నాడు ఏ రాశి వారు ఏం దానం చేయాలి?
- Moon Transit: చంద్ర సంచారం.. ఈ మూడు రాశులకు జాక్‌పాట్.. ఊహించని లాభాలు!
- భార్యను చంపేశానంటూ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన భర్త.. విచారణలో సంచలనాలు..!
- జైల్లో ఉన్న భర్తను బెయిల్‌పై బయటకు తెచ్చిమరీ చంపిన భార్య.. అసలు కారణం తెలిస్తే
- బెజవాడ అడ్డాగా గలీజ్ దందా..! వయా బంగ్లాదేశ్, కోల్‌కతాతో లింకులు బట్టబయలు..





