తెలంగాణ ప్రభుత్వం టీఎస్ కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం టీఎస్కు బదులు టీజీ మారిస్తే భారీగా ప్రభుత్వ ధనం ఖర్చు చేయాల్సి వస్తుందంటూ ఫేక్ నోట్ ను వ్యాప్తి చేస్తున్న వారిపై కేసు నమోదైంది. టీఎస్ నుంచి టీజీగా పేరు మార్పునకు రూ.2,767 కోట్లు ఖర్చవుతాయని సైబర్ నేరగాళ్లు ఓ ఫేక్ నోట్ ను రూపొందించారు. దీనిపై విచారణ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు.. దాన్ని సృష్టించిన వారిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ నోట్ ను ప్రచారం కావడంపై ప్రభుత్వం సీరియస్ కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఇలాంటి అసత్యాలు ప్రచారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025