SGSTV NEWS online
CrimeTelangana

Variety Thief : వీడో వెరైటీ దొంగ.. ఏం ఎత్తుకెళ్ళాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!



మొన్నటివరకూ దేశమంతా ఎండలతో అల్లాడిపోయింది. వేసవి తాపాన్ని తట్టుకోలేక రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్థానికులు, పాదచారులు, ప్రయాణికుల సౌకర్యార్థం ఎక్కడపడితే అక్కడ చలివేంద్రాలు వెలిశాయి. ఇదే క్రమంలో హైదరాబాద్ మహానగరంలో సైతం ఎన్నో చలివేంద్రాలు ఏర్పాటైన సంగతి తెలిసిందే. పాతబస్తీ లాంటి అనేక ప్రాంతాల్లో ఎండ తీవ్రంగా ఎక్కువగా పెరగడంతో చల్లటి నీళ్ల కోసం అక్కడక్కడా ఫ్రిడ్జిలు ఏర్పాటు చేశారు.

కాగా, ఇలాంటి ఫ్రిడ్జ్ దగ్గర జరిగిన ఓ ఘటనే ఇప్పుడు సంచలనంగా మారింది. రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన ఓ ఫ్రిడ్జ్ దగ్గర నీళ్లు తాగినట్లు నటించిన ఓ దొంగ ఏకంగా అక్కడ ఉన్న నల్లాని చోరీ చేసి, అది తీసుకుని వెళ్లిపోయాడు. దొంగతనాల్లో ఇలాంటివి కూడా ఉంటాయని ఇలాంటివి చూసినప్పుడే అనిపిస్తుంది. ప్రజల దాహార్తి తీర్చడం కోసం ఈ విధంగా ఏర్పాటు చేసిన నల్లాని ఆ దొంగ తీసుకెళ్లడం చూస్తే కనీస మానవత్వం కూడా కరువైందే మనుషుల్లో అనిపించక మానదు. ఇందుకు సంబంధించిన వీడియో మొత్తం అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీలో రికార్డు అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్లు ఇలాంటి వాళ్లు కూడా ఉన్నందుకు బాధ పడాలో, ఇంత చిన్న వస్తువు కూడా దొంగిలించే వాళ్లు ఉన్నందుకు సిగ్గుతో నవ్వుకోవాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు..!

Also read

Related posts