హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల కారణంగా మరో చిన్నారి అసువులుబాశాడు. తాజాగా మియాపూర్ పరిధిలో ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేయడంతో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది.
హైదరాబాద్ మియాపూర్ పరిధిలో ఘటన
మియాపూర్, : హైదరాబాద్ నగరంలో వీధి కుక్కల కారణంగా మరో చిన్నారి అసువులుబాశాడు. తాజాగా మియాపూర్ పరిధిలో ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లిన ఆరేళ్ల బాలుడిపై శునకాలు దాడి చేయడంతో మృతిచెందిన ఘటన బుధవారం వెలుగు చూసింది. మియాపూర్ సీఐ దుర్గారామలింగప్రసాద్,స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మక్తమహబూబ్పేట గ్రామానికి చెందిన వీరేశ్, శిరీష దంపతుల కుమారుడు సాత్విక్(6) ఒకటో తరగతి
చదువుతున్నాడు. సుమారు నాలుగేళ్ల క్రితం తల్లి అనారోగ్యంతో మృతిచెందగా.. తండ్రితో కలిసి నాయనమ్మ దేవమ్మ వద్ద ఉంటున్నాడు. తండ్రి కూలి పనులకు వెళ్లడం, పాఠశాలకు సెలవులు కావడంతో భిక్షాటన చేసుకునే నాయనమ్మతో కలిసి రోజూ ఇంటి నుంచి డంపింగ్ యార్డ్ మీదుగా ధర్మపురి క్షేత్రం వైపు వెళ్లేవాడు. మంగళవారం నాయనమ్మతో వెళ్లకుండా బయట ఆడుకుంటానని చెప్పి డంపింగ్ యార్డ్ వద్దే ఆగిపోయాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. బుధవారం ఉదయం యార్డు వద్ద
పరిశీలిస్తుండగా సాత్విక్ తీవ్ర గాయాలతో విగతజీవిగా కనిపించడంతో భోరున విలపించారు. ఘటనా స్థలానికి చేరుకొని క్లూస్ టీంతో పరిశీలన చేపట్టిన పోలీసులు బాలుడు శునకాల దాడిలోనే మృతిచెందినట్లు గాయాలను బట్టి తెలుస్తోందని వెల్లడించారు.
Also read
- AP Crime: ఏపీలో మరో పరువు హత్య.. మైనర్ బాలికను చంపేసిన పేరెంట్స్!?
- సర్కార్ గట్టుకు మరమ్మతులు చేపట్టిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము
- గురు, రాహువులతో ఆ రాశులకు ఐశ్వర్య యోగాలు..!
- Vastu Tips: ఈ పక్షులు ఇంటికొస్తే మీ దశ తిరిగినట్టే.. ఈ మూగజీవాలు ఇచ్చే సంకేతాలివే..
- నేటి జాతకములు.11 ఏప్రిల్, 2025