April 19, 2025
SGSTV NEWS
Andhra PradeshCrime

Anakapalle: అప్పటివరకు ఆనందం.. అంతలోనే విషాదం


Anakapalle: అప్పటివరకు ఆనందం.. అంతలోనే విషాదం
విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటిదాకా ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన వారిని.. అంతలోనే మృత్యువు కెరటం రూపంలో బలి తీసుకుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి….


విహారయాత్ర ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  కెరటం మృత్యువు రూపంలో దూసుకువచ్చి.. అక్కా చెల్లెళ్లను బలి తీసుకుంది. జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి తీరాన్ని ఆనుకొని ఉన్న కొండరాళ్లపై నిలుచుని ఫొటో తీసుకోవడానికి వెళ్లిన వారిద్దర్నీ దూసుకొచ్చిన అల బలి తీసుకుంది.


అనకాపల్లి జిల్లా అచ్చుతాపురంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తంతడి బీచ్‌లోని రాకాసి అలలు ఇద్దరిని మింగేయడం… స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. నూకరత్నం, కనకదుర్గ… అక్కాచెల్లెల్లు. ఆదివారం కావడంతో… ఇద్దరు తమ కుటుంబానికి చెందిన ఐదుగురితో కలిసి తంతడి-వాడపాలెం తీరంలో గడపడానికి ఆదివారం వచ్చారు.  అలలతో ఆడుకుంటూ కాసేపు సరదాగా గడిపారు. అయితే ఇద్దరు పోటీపడి అలలకు ఎదురుగా వెళ్లడంతోనే ఈ విషాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. వారి పక్కనే ఉన్న శిరీష అనే మహిళ కూడా అలలు ఒక్కసారిగా మీదకు రావడంతో అక్కడికక్కడే పడిపోయింది. వెంటనే స్పందించిన కొందరు యువకులు శిరీషను కాపాడారు. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆమె ప్రాణపాయ స్థితిలో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.  అక్కాచెల్లెళ్లను మాత్రం కాపాడలేకపోయారు. ఇక ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

Also read

Related posts

Share via