మాజీ ఎమ్మెల్యే, తమిళ నటుడు కరుణాస్ బ్యాగులో తూటాలు బయటపడ్డాయి.
చెన్నై: సినీ నటుడు, మాజీ ఎమ్మెల్యే కరుణాస్ బ్యాగులో పెద్ద సంఖ్యలో బుల్లెట్లు బయటపడటం కలకలం రేపింది. ఆదివారం ఉదయం ఆయన విమానం ఎక్కేందుకు చెన్నై డొమెస్టిక్ ఎయిర్పోర్టుకు వచ్చారు. తనిఖీల సమయంలో ఆయన బ్యాగులో దాదాపు 40 బుల్లెట్లు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారంపై నటుడిని ప్రశ్నించగా.. వీటిని తీసుకెళ్లేందుకు తగిన డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నట్లు అధికారులకు చెప్పారు. దీంతో బుల్లెట్లు ఉన్న బ్యాగుతో విమానం ఎక్కేందుకు నిరాకరించిన అధికారులు.. తిరిగి వెనక్కి వెళ్లిపోయేందుకు ఆయన్ను అనుమతించారు.
Also read
- Shani Trayoshi: శని నక్షత్రంలో త్రయోదశి.. ఈ రహస్య రెమిడీలు పాటిస్తే సాడేసాతి దోషాల నుంచి శాశ్వతంగా రిలీఫ్ .!.
- Shani Trayodashi 2026: రేపే శని త్రయోదశి.. పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయొద్దు..
- శరత్ పౌర్ణమి ఎప్పుడు? ఆ రోజు పాలలో చంద్రుడిని ఎందుకు చూస్తారో తెలుసా..?
- పెళ్లికాని అమ్మాయిలు కాబోయే భర్త కోసం కర్వా చౌత్ వ్రతం చేయవచ్చా? నియమాలు ఇవే!
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?





