November 22, 2024
SGSTV NEWS
CrimeNational

చెన్నైలో తెలుగు అమ్మాయికి దారుణం! లైఫ్ సెటిల్ అయ్యే స్టేజ్ లో ఇలా!


తాజాగా చెన్నైలో తెలుగు అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ మృతి చెందింది. అయితే కష్టపడి చదివి మంచి జాబ్ సంపాదించుకొని కుటుంబంకు అండగా ఉంటున్న సమయంలో దేవుడు చిన్న చూపు చూశాడమో తెలియదు కానీ, చాలా దారుణం చోటు చేసుకుంది. ఇంతకి ఏం జరిగిందంటే..?

ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసిన రైళ్లు ప్రమాదాలు అనేవి ఎక్కువగా చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. కాగా, ఈ ప్రమాదాల్లో గాయపడిన వారి కంటే మరణించిన వారి సంఖ్య ఎక్కువగా  పెరిగిపోతుంది. అయితే ఎక్కువ శాతం ప్రమాదవశాత్తు రైలు ఢీ కొట్టడంతో మరణించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా చాలామంది రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో మరణిస్తున్నారు. కానీ, ఈ ప్రమాదాలు అనేవి అప్రమత్తంగా జరిగినవి కొన్ని అయితే.. మరికొన్ని అకస్మాత్తుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా చెన్నైలోని రైలు ప్రమాదంలో మరో ఘోర సంఘటన చోటు చేసుకుంది. కాగా, ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రైలు పట్టాలు దాటుతుండగా నిమిషాల వ్యవధిలో రైలు ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..


చెన్నైలో జరిగిన ఓ రైలు ప్రమాదంలో తెలుగు అమ్మాయి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అయితే పట్టాల దాటుతుండగా.. చెన్నై పెరుంగళత్తూర్ అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని యువతి మృతి చెందింది. అయితే ఈ ఘటనలో మృతి చెందిన యువతి తాళ్ల రేవు, మాధవరాయునిపేటకు చెందిన పిల్లి ధరణిసత్య (23) గా తెలిసింది. కాగా, మాధవరాయునిపేటకు చెందిన పిల్లి ఏడుకొండలు, ఈశ్వరి దంపతులకు ముగ్గురు కుమార్తెలు. ధరణిసత్య, పావనిశ్రీహిత, భవానిశ్రీభవ్య ఉన్నారు. అయితే కూలి పనులు చేసుకున్న ఈ దంపతులు తమ ముగ్గురు కుమార్తెలను ఉన్నత చదువులు చదివించారు. ఈ క్రమంలోనే.. పెద్దకుమార్తె ధరణిసత్య బీటెక్‌ పూర్తి చేసి ఇటీవల సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా సెలెక్ట్ అయ్యింది. దీంతో 8 నెలల క్రితం  చెన్నైలోని పెరుంగళతూర్‌ సదన్‌ల్యాండ్‌ ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరింది. ఇక స్నేహితులతో కలిసి అక్కడే ఉద్యోగం చేస్తోంది.

అయితే రోజు వారి భాగంగానే బుధవారం ఉదయం తన స్నేహితులతో కలిసి డ్యూటీకీ వెళుతున్న ధరణిసత్య.. లోకల్ ట్రైన్ దిగి పెరుంగళతూర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్‌ దాటుతుండగా.. వేగంగా వచ్చిన అంత్యోదయ ఎక్స్‌ప్రెస్‌ రైలు ధరణి సత్యను ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతి చెందింది. ఇక సెల్ పోన్ ఆధారంగా యువతి   కుటుంబసభ్యులకు రైల్వే పోలీసులు సమాచారం అందిచారు. అనంతరం చెన్నై క్రోంపేట ప్రభుత్వ ఆసుపత్రి వర్గాలు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.  అలాగే ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న తమిళనాడు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే.. ఆడ పిల్లలను చదివించి ప్రయోజకులను చేయాలనే లక్ష్యంతో తల్లిదండ్రులు కూలి పనులు చేస్తూ ముగ్గురు పిల్లలనూ ప్రోత్సహించారు. ఈ క్రమంలోనే.. ఉద్యోగం సంపాదించి కుటుంబంకు ఆసారగా నిలిచిన పెద్ద కుమార్తే ఇలా ప్రమాదవశాత్తు మరణించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా విలపించారు

Also read

Related posts

Share via