హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు.
హైదరాబాద్ మహా నగరంలో బాంబు బెదిరింపు కాల్ కలకలం సృష్టించింది. ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ క్యాంపు కార్యాలయం ప్రగతి భవన్.. ప్రస్తుత ప్రజాభవన్‌లోనే బాంబు పెట్టామని అగంతకులు హెచ్చరించారు. మరికాసేపట్లో పేలి పోతుంది అంటూ పోలీస్ కంట్రోల్ రూమ్ కి అగంతకుడు ఫోన్ కాల్ చేశాడు. ప్రజా భవన్‌కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అప్రమత్తమైన పోలీసులు, బాంబ్ స్వ్కాడ్ బృందాలు హుటాహుటీన చేరుకుని తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడి తెలంగాణ డిప్యూటీ భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. బాంబు బెదిరంపుతో సిబ్బంది అప్రమత్తం అయ్యారు. సిబ్బంది సహా అందరినీ భవన్ నుంచి ఖాళీ చేయించి బాంబ్ స్క్వాడ్ తనిఖీలు జరుపుతోంది. మరోవైపు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఫోన్ చేసిన ఆగంతకుడిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు
Also read
- Vijayawada:పోలీస్ ల నుండి తప్పించుకునేందుకు.. అపార్ట్మెంట్ పైనుంచి దూకేసిన యువకుడు
- Guntur: కాల్ బాయ్‌గా చేస్తే సూపర్ ఇన్‌కం.. టెమ్ట్ అయి కమిటయిన కొందరు.. ఆ తర్వాత
- Hyderabad: చదువుకోమని తల్లి మందలించిందని..
- Crime News: కరీంనగర్లో దారుణం.. బాలికపై గ్యాంగ్ రేప్.. ఆపై వీడియో తీసి..
- BIG BREAKING: తెనాలిలో కలకలం.. పట్టపగలు నడిరోడ్డుపై దారుణ హత్య!