హైదరాబాద్ రహమత్ నగర్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మేడపై బాలిక ఆడుకుంటుండగా హైటెన్షన్ (11 కేవి) వైర్లు పాపకు తగిలాయి. ప్రమాదవశాత్తు విద్యుత్ అఘాతానికి గురై 90% బాలిక శరీరం కాలిపోయింది. దీంతో బంధువులు చికిత్స నిమిత్తం హుటాహుటిన గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాప ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు బంధువులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వైర్లు తక్కువ ఎత్తులో ఉండడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలాంటి సమస్యను ముందే గుర్తించి స్థానిక విద్యుత్ శాఖను సంప్రదించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకపై వారు కూడా తమ పిల్లల పట్ల జాగ్రత్త వహిస్తామని అంటున్నారు. అధికారులు స్పందించి ఇలాంటి సమస్యలపై దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు. తద్వారా భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరుతున్నారు.
Also read
- ప్రతిరోజూ పెళ్లి చేసుకొనే స్వామిని సందర్శిస్తే మీకు కూడా వివాహం
- Telangana: ఇదెక్కడి యవ్వారం.. గాజుల పండక్కి పిలవలేదని.. ఏకంగా కోర్టుకెళ్లిన మహిళ.. ఎక్కడంటే?
- Andhra: పెట్రోల్ కొట్టించేందుకు బంక్కొచ్చిన కానిస్టేబుల్.. ఆపై కాసేపటికే తోపునంటూ..
- Fake DSP: ఉద్యోగాల పేరుతో యువకులకు ఎరా.. తీగలాగితే కదులుతున్న నకిలీ డీఎస్పీ దందా!
- Tuni: తండ్రి మరణంపై నారాయణరావు కుమారుడు రియాక్షన్ వైరల్.. అనూహ్య రీతిలో