భర్త మరణించి ఒంటరిగా గడుపుతున్న మహిళకు మరో జీవితాన్ని ప్రసాదించాడు. మహిళను రెండో పెళ్లి చేసుకుని.. ఆమె కూతురికి తండ్రిగా నిలిచాడు. కానీ చివరకు
భర్త లేని మహిళకు అండగా నిలిచాడు. ఆమెకు పుట్టిన బిడ్డను తన పాపగా చూసుకున్నాడు. ఇద్దరు ఒకే వృత్తిలో ఉన్నారు. భార్యా భర్తలిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఈ ఇద్దరు దంపతులకు ఓ కొడుకు కూడా పుట్టాడు. అలాగే కూతురికి నచ్చిన వ్యక్తితో పెళ్లి చేశాడు సవితి తండ్రి. ఆమె పురుడు కోసం పుట్టింటికి వచ్చింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. ఆడ పిల్లను ప్రసవించి, అమ్మనాన్నల దగ్గరే ఉంది. కానీ ఊహించని విధంగా ఆమెతో పాటు అభం, శుభం తెలియని పసిగొడ్డును, కొడుకును కూడా చంపేశారు కసాయి తల్లిదండ్రులు. అనంతరం వారు ఆత్మహత్య చేసుకున్నారు. ఉపాధ్యాయ దంపతులతో పాటు ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తమిళనాడులో సంచలనం కలిగిస్తుంది.
విరుదునగర్ జిల్లా శివకాశి సమీపంలో అప్పుల బాధతో ఉపాధ్యాయ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుత్తంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నారు భార్యా భర్తలు లింగం, పళనిఅమ్మాళ్. వీరిద్దరూ స్థానికంగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లుగా పనిచేస్తున్నారు. పళనిఅమ్మాళ్ మొదటి భర్త 20 ఏళ్ల క్రితం ప్రమాదంలో చనిపోయాడు. ఆమె కుమార్తె ఆనందవల్లితో కలిసి ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ధర్మపురం పాఠశాలలో పనిచేస్తున్న సమయంలో లింగంతో పళనియమ్మాల్‌కు పరిచయం ఏర్పడగా.. అది ప్రేమగా మారింది. దీంతో ఆమెను రెండో పెళ్లి చేసుకున్నాడు లింగం. ఆ తర్వాత వీరిద్దరికీ ఆదిత్య జన్మించాడు. కూతురు ఆనందవల్లి చదువు పూర్తి చేసి చెన్నై ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది.
కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కొలిగ్ తో పరిచయం.. ప్రేమకు దారి తీయగా.. ఆమెకు ఇష్టమైన పెళ్లి చేశారు పెద్దలు. ఈ దశలో ప్రసవం కోసం ఆనందవల్లి పుట్టింటికి వచ్చింది. రెండు నెలల క్రితమే.. ఆడ పిల్ల జన్మించగా.. ఆమెకు శాస్తిక అని పేరు పెట్టుకున్నారు. ఈ క్రమంలో లింగం అప్పుల బాధలో కూరుకుపోయాడు. పళనియమ్మాళ్‌ను వివాహం చేసుకోవడం ఇష్టం లేని పేరెంట్స్.. అతడికి చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదు. అవసరాల కోసం రెండు కోట్ల వరకు అప్పులు అయిపోయాడని తెలుస్తోంది. దీంతో అప్పుల వాళ్లు.. తిరిగి డబ్బులు ఇవ్వాలంటూ ఒత్తిడి చేయడం మొదలు పెడితే.. తన ఆస్తి తనకు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు లింగం. వాళ్లు ఇవ్వని తెగేసి చెప్పడంతో దారుణ నిర్ణయానికి తెగించాడు. మీ అప్పులు అన్నీ చెల్లిస్తానని అప్పులిచ్చిన వాళ్లకు హామీనిచ్చాడు. ఫోన్ చేసినా ఎంతకు తీయకపోవడంతో పాటు.. ఇంట్లో నుండి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఇరుగు పొరుగు లింగం ఇంట్లోకి చూడగా.. లింగం-పళనీ మృతదేహాలు ఉరి కొయ్యకు వేలాడుతున్నాయి.
పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా లింగం- పళనిఅమ్మాళ్ దంపతులే కాకుండా వారి కుమార్తె ఆనందవల్లి, కుమారుడు ఆదిత్య, రెండు నెలల చిన్నారి శాస్తిక కూడా మృతి చెందినట్లు గుర్తించారు. వారిలో కుమార్తె ఆనందవల్లి, ఆదిత్య, చిన్నారి శాస్తిక నోటి నుంచి నురగలు రావడంతో.. పురుగుల మందు తాగి చనిపోయారని నిర్దారించారు. అప్పుల బాధ భరించలేక పిల్లలు ఆనందవల్లి, ఆదిత్య, మనవరాలు శాస్తికలను విషం ఇచ్చి చంపి, ఆపై లింగం-పళనిఅమ్మాళ్ ఇద్దరూ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 22 నవంబర్, 2024
- తెలంగాణ : అయ్యో..పాపం..వీళ్లు బంధువాలా.. రాబందువులా?.. ఆస్తిని కాజేసి చివరికి..
- ఈ ఆంజనేయ స్వామి కొండ ఎక్కితే.. పచ్చగా మారుతున్న భక్తులు
- చెల్లి ఫొటోతో ఎఫ్బీ అకౌంట్..యువకుడి నుంచి కోట్లువసూలు, ట్విస్ట్ సూపర్
- అమ్మాయితో మాట్లాడాడని ఇంటర్ విద్యార్థిపై దాష్టీకం కోనసీమలో నలుగురు యువకుల దౌర్జన్యం