విశాఖపట్నంలో తీగ లాగితే.. కంబోడియాలో డొంక కదలింది. డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి.. నిరుద్యోగ యువతను చైనా కంపెనీలకు పంపిస్తున్నారు ఏజెంట్లు. మన కంటిని మన చేత్తోనే అనే చందంగా.. భారతీయులతోనే భారతీయులకు గాలమేస్తున్నారు కంబోడియా జాదూగాళ్లు..
డేటా ఎంట్రీ ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి చైనా కంపెనీలకు పంపిస్తున్నారు ఏజెంట్లు. అమాయక నిరుద్యోగులకు వలవేసి.. దేశం కానీ దేశం తీసుకెళ్లి చుక్కలు చూపిస్తున్నారు. టూరిస్ట్ వీసాపై బ్యాంకాక్ తీసుకెళ్లి అక్కడి నుంచి కంబోడియాకు అక్రమంగా తరలిస్తారు. అక్కడికెళ్లిన తర్వాత అసలు సినిమా చూపిస్తున్నారు. పాస్ పోర్టులు గుంజుకుని చీకటి గదుల్లో బంధించి చిత్రహింసలు పెడతారు. సైబర్ క్రైమ్స్ ఎలా చేయాలో..ఇండియాన్లను ఎలా ట్రాప్ చేయాలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ మాయగాళ్ల వలలో చిక్కుకుని కంబోడియాకు వెళ్లిన బాధితులు నిర్వహకులపై తిరుగుబాటు చేస్తున్నారు. అయితే.. ఆందోళనకు దిగిన భారతీయులను కంబోడియా పోలీసులు అరెస్ట్ చేశారు. కంబోడియా నుంచి తమకు విముక్తి కల్పించాలని విశాఖ పోలీసులకు వీడియోలు పంపించారు బాధితులు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖను సంప్రదించిన విశాఖ సీపీ..బాధితులను సురక్షితంగా రప్పించేందుకు చర్యలు చేపట్టారు. వైజాగ్ పోలీసుల చొరవతో బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు.
కంబోడియాకు వెళ్లిన 150మంది నిరుద్యోగులు
ఏపీ నుంచి కంబోడియాకు నిరుద్యోగులను హ్యూమన్ ట్రాఫికింగ్ చేసి బలవంతంగా సైబర్ నేరాలు చేయిస్తోంది గ్యాంగ్. బాధితుల ఫిర్యాదుతో హ్యూమన్ ట్రాఫికింగ్ పై ఫోకస్ పెట్టిన విశాఖ పోలీసులు..కూపీ లాగుతున్నారు. ఏడు ప్రత్యేక బృందాలతో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏపీ నుంచి దాదాపు 150మంది నిరుద్యోగులను కంబోడియాకు తీసుకెళ్లినట్టు CP చెప్పారు. ఒక్కొక్కరి దగ్గరి నుంచి దాదాపు లక్షన్నర వసూలు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు ఏజెంట్లను విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు.
కంబోడియాకు తీసుకెళ్లిన తర్వాత..ఏవిధంగా ఇండియన్లను ఆన్ లైన్ స్కాంలోకి లాగాలనే దానిపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంటే..మన ఇండియన్లను అక్కడికి తీసుకెళ్లి.. ఇక్కడున్న భారతీయులను ఎలా ట్రాప్ చేయాలో నేర్పిస్తున్నారీ కంబోడియా జాదూగాళ్లు. ఈ నేరాల్లో వారు సంపాదించిన డబ్బులో ఒక శాతం మాత్రమే వారికి ఇచ్చారు. మిగిలినది కంపెనీలు తమ ఖాతాల్లో డిపాజిట్ చేసుకునేవి. ఇలా ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు తమను సంప్రదించాలన్నారు సీపీ
Also read
- Annavaram: ఆలయంలో పెళ్లి.. పీటలపై ఏడుస్తూ కనిపించిన వధువు.. ఏంటా అని ఆరా తీయగా
- ఒంగోలులో TTD గోవుల అమ్మకం.. కమిషన్ల కోసం ఏం చేశారంటే.. టీటీడీ చైర్మన్ సంచలన ఆరోపణలు!
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!