స్టాక్ ట్రేడింగ్ పేరుతో రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ట్రేడింగ్ పేరుతో వస్తున్న మోసాలను పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 213 మంది బాధితులు ట్రేడింగ్ బారినపడి మోసపోయినట్లు పోలీసులు విచారణలో బయటపడింది..
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రోజురోజుకు మోసాలు పెరుగుతున్నాయి. ఆన్లైన్లో ట్రేడింగ్ పేరుతో జరుగుతున్న మోసాలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతిరోజు ట్రేడింగ్ పేరుతో వస్తున్న మోసాలను పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. రెండు నెలల వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా సుమారు 213 మంది బాధితులు ట్రేడింగ్ బారినపడి మోసపోయినట్లు పోలీసులు విచారణలో బయటపడింది. ట్రేడింగ్ ఎలా చేయాలో మొదలుపెట్టి ఎక్కువ మొత్తంలో లాభం వస్తుందని నమ్మించి అధిక మొత్తం పెట్టుబడి పెట్టేలాగా బాధితులను ప్రేరేపిస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారికి మార్చి 11న ఇంటర్నేషనల్ స్టాక్ ట్రేడింగ్ అకౌంట్ పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. ట్రేడింగ్ చేయాలో సలహాలు ఇస్తామంటూ మొదలైన సంభాషణ అధిక పెట్టుబడులు పెట్టేంతవరకు బాధితుడిని ప్రేరేపించారు. దీంతో వారి సలహాలు సూచనలు విన్న తర్వాత పలు దఫాలుగా రూ. 30 లక్షల రూపాయలను వీరు చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు. ఆ డబ్బులు కాస్త రెట్టింపు కావడంతో బాధితుడు సైతం ఇది నిజమేమోనని నమ్మాడు. అలా మొత్తం రూ.13 కోట్ల వరకు లాభం చూపించారు. ఆన్లైన్ అప్‌లో చూపిస్తున్న రూ.13 కోట్ల రూపాయలలో ఐదుకోట్ల రూపాయలను తన బ్యాంక్ ఖాతాకు విత్ డ్రా చేసుకోవాలని బాధితుడు భావించాడు. అయితే విత్ డ్రా కోసం టాక్స్ రూ.1.3 కోట్లు చెల్లించాలని నేరగాళ్లు బాధితుడిని నమ్మించారు. దీంతో అనుమానం వచ్చిన బాధితుడు తిరిగి వారిని ప్రశ్నించడంతో బాధితుడి నంబర్‌ను బ్లాక్ చేశారు. పెట్టుబడి పెట్టిన డబ్బు మొత్తం నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లోకి బదిలీ అయింది.
ఇలా స్టాక్ ట్రేడింగ్ పేరుతో వస్తున్న మెసేజ్లు, ప్రకటనలు, లింకులు క్లిక్ చేయవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రేడింగ్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. దీంతో ట్రేడింగ్ గురించి అవగాహన లేని వారు ఈజీగా మోసపోతున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. స్టాక్ ట్రేడింగ్ పేరుతో వచ్చే మోసాలతో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ డిమాట్ అకౌంట్ వివరాలను ఇతరులతో పంచుకోవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకవేళ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో పదే పదే మెసేజ్లు వస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. గత ఏడాది స్టాక్ ట్రేడింగ్ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా 600 మంది బాధితులు మోసపోయారు. మీరు వద్ద నుండి సుమారు మూడు కోట్ల రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేసినట్లు పోలీసులు తెలిపారు. ఏడాది రెండు నెలల వ్యవధిలోనే రూ. 27 కోట్ల రూపాయల డబ్బును ట్రేడింగ్ పేరుతో కొట్టేశారు.
Also read
- Palnadu: భార్యపై అనుమానంతో భర్త ఘాతుకం.. ఏం చేశాడో తెలుస్తే షాక్!
- AP Crime: ఏపీలో దోపిడి దొంగల బీభత్సం.. పట్టపగలే ఇళ్లలోకి దూరి!
- అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్‌గా లేపేసింది!
- వరూధుని ఏకాదశి రోజున తులసితో ఈ పరిహారాలు చేయండి.. పెండింగ్ పనులు పూర్తి అవుతాయి..
- Swapna Shastra: కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే మీకు మంచి రోజులు వచ్చాయని అర్ధమట..