హైదరాబాద్‌లోని పంజాగుట్ట పరిధిలో ఓ యువతిపై యాసిడ్ అటాక్ జరిగినట్లు గురువారం మధ్యాహ్నం వార్తలు వచ్చాయి. ICFAI యూనివర్సిటీలో బీటెక్ చదివే విద్యార్థినిపై యాసిడ్ అటాక్ జరిగినట్లు చెబుతున్నారు. హాస్టల్ రూమ్‌లో స్నానం చేసేందుకు వెళ్లగా.. అప్పటికే బకెట్‌లో గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్ పోశారని… అయితే.. బకెట్‌లో ఉన్నది నీరే అనుకున్న విద్యార్థిని.. మగ్గుతో ముంచుకుని ఒంటిపై పోసుకుందని… దీంతో గాయాలయినట్లు మధ్యాహ్నం వరకు వదంతులు వినిపించాయి. అయితే.. ఆమె ఒంటిపై వేడి నీరు పడటం వల్లే గాయాలైనట్లు పోలీసులు ప్రాథమికంగా చెబుతున్నారు. దీనిపై పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. గాయపడ్డ యువతి కేకలు వేయడంతో.. ఫ్రెండ్స్ హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. డాక్టర్లు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థిని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని.. ఆమె కోలుకున్న పూర్తి వివరాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు.

ఈ ఘటనతో యూనివర్సిటీలో ఒక్కసారిగా ఆందోళనకర వాతావరణం నెలకొంది. ఘటన వెనుకు ర్యాగింగ్‌లాంటిదేమైనా ఉందా.. లేదా ఇంకేమైన కారణాలున్నాయా.. అంటూ రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఆయా కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.
Also read
- ఏంతకు తెగించావురా… బంగారం కావాలంటే కొనుక్కోవాలి… లాక్కోకూడదు.
- ప్రియుడి భార్యపై HIV ఇంజెక్షన్‌తో దాడి.. ఆ తర్వాత సీన్ ఇదే!
- అర్ధరాత్రి వేళ ట్రావెల్స్ బస్సు బీభత్సం.. డ్రైవర్ పొట్టలోకి దిగిన వెదురు బొంగులు!
- గుంటూరులో వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఆరుగురి అరెస్ట్*
- నిమ్మకాయలు.. నల్లటి ముగ్గు.. పసుపు కుంకుమలు.. ఆ ఇళ్ల ముందు రాత్రికి రాత్రే ఏం జరిగింది….





