November 24, 2024
SGSTV NEWS
Andhra PradeshAssembly-Elections 2024Crime

ఆంధ్రప్రదేశ్ : భార్యాబిడ్డలను హింసిస్తూ.. ఏజెంట్‌కు వీడియోకాల్‌

పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి

*  బూత్‌ వదిలి వెళ్లాలని బెదిరింపు..

*  పిన్నెల్లి గ్రామంలో పోలింగ్‌ రోజు

*  రెచ్చిపోయిన వైసీపీ గూండాలు..

*   ఆలస్యంగా వెలుగులోకి

గుంటూరు, మే 15 : పోలింగ్‌ రోజు పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో జరిగిన వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం కళ్లకుంట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత గ్రామం. ఆ గ్రామంలో గత నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున పోలింగ్‌ ఏజెంట్‌ లేడు. ఈ ఎన్నికల్లో కూడా ఏకపక్షంగా ఎన్నికలు జరిపించాలని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుకున్నారు టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి…. వైసీపీ నేత ఆలోచనకు గండికొడుతూ అక్కడ ఏజెంట్‌గా దళితవర్గానికి చెందిన నోముల మాణిక్యాన్ని కూర్చోబెట్టారు. పోలింగ్‌ మొదలైన తర్వాత వైసీపీ నాయకులు మాణిక్యాన్ని బయటికి వెళ్లాలని సూచించారు. తాను బయటకు వెళ్లనని మాణిక్యం అక్కడే కూర్చున్నారు. దీంతో వైసీపీ నేతలు రెచ్చిపోయారు. గ్రామంలోకి వెళ్లి మాణిక్యం ఇంటిని చుట్టుముట్టారు.

ఆయన భార్యా పిల్లలను తీవ్రంగా కొడుతూ వీడియో కాల్‌ చేశారు. భార్యాపిల్లలను హింసిస్తూ పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాకపోతే చంపేస్తామని ఆ వీడియో కాల్‌లో మాణిక్యాన్ని బెదిరించారు. అయినా మాణిక్యం పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు రాలేదు. మధ్యాహ్నం తర్వాత ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి మాణిక్యాన్ని కొట్టి బయటకు పంపించారని సమాచారం. ఆ తర్వాత మాణిక్యం ఇల్లు ఖాళీ చేసి భార్యాబిడ్డలను తీసుకుని ఊరి నుంచి వెళ్లిపోయారు. మాచర్ల నియోజకవర్గంలోని కేపీగూడెం పోలింగ్‌ బూత్‌లో కూడా ఇదేవిధంగా పైశాచికత్వాన్ని వైసీపీ గూండాలు ప్రదర్శించారు. ఏజెంట్లుగా కూర్చున్న హనుమంతునాయక్‌, రేక్యానాయక్‌, చిన్న మంత్రునాయక్‌లను పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వెళ్లాలని బెదిరించారు. వారు వినకపోవడంతో వారిళ్లను పూర్తిగా ధ్వంసం చేశారు. ఆ తర్వాత పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లి ఆ ముగ్గురినీ చితగ్గొట్టారు.

పిన్నెల్లిపై భక్తి చాటుకున్న ఖాకీలు..వేటుకు రంగం సిద్ధం..

మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల రోజున, ఆ తర్వాత రోజు వైసీపీ గూండాలు సాగించిన అరాచకత్వానికి స్థానిక పోలీసుల్లో కొందరు తమ వంతు సహకారం అందించినట్లు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఆ పోలీసుల వివరాలు ఇప్పటికే పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చేరాయి. స్పెషల్‌ పోలీసుల కదలికలను, డిపార్ట్‌మెంట్‌ తీసుకుంటున్న చర్యలను వీరు ఎప్పటికప్పుడు పిన్నెల్లి మనుషులకు చేరవేశారని సమాచారం. విధ్వంస కాండ సాగించిన వైసీపీ మూకలు తేలిగ్గా తప్పించుకుని పోవడానికి ఈ సమాచారం ఉపకరించిందని ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. దీనిపై ఏడుగురు స్థానిక పోలీసులను వారి కాల్‌ డేటా ఆధారంగా గుర్తించారు. దీనిపై లోతైన విచారణకు రాష్ట్ర డీజీపీ ఆదేశించినట్టు సమాచారం.



పోలీస్‌ వలయంలోనే పల్నాడు..

మాచర్ల నియోజకవర్గంలో పోలీసులు హైఅల్టర్‌ ప్రకటించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ మాచర్ల పట్టణంలో మకాం వేసి శాంతి భద్రతలను పర్యవేక్షిస్తున్నారు. మైకుల ద్వారా 144 సెక్షన్‌ అమలులో ఉందని ప్రచారం నిర్వహిస్తున్నారు. వ్యాపారులు తమ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. దీంతో పట్టణం బోసిపోయింది. అనుమానం ఉన్న గృహాల్లో పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ తనికీలో గాజు సీసాలు, ఖాళీ బీర్‌ బాటిళ్లు, రాడ్లు, కర్రలు గుర్తించి సిబ్బంది వాటిని మినీ ట్రాలీలో వేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పట్టణం, మండల పరిధిలోని సమస్యాత్మకమైక గ్రామాల్లో రాజకీయ పార్టీలకు చెందిన కార్యకర్తలు, నేతలను బైండోవర్‌ చేశారు. వారికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపించివేశారు. మాచర్ల పట్టణంలో 800 మంది ఆర్‌పీఎఫ్‌, సీఎ్‌సఎఫ్‌, ఎస్‌పీఎఫ్‌, ఏపీఎస్పీ, సివిల్‌ పోలీసులు మోహరించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిల హౌస్‌ అరెస్ట్‌ బుధవారం కూడా కొనసాగింది.

Also read

Related posts

Share via