ఈ మధ్య కాలంలో భార్యాభర్తల చిన్ని చిన్న వివాదాలు చిలికి చిలికి గాలివానగా మారి ఎన్నో అనార్థాలకు దారి తీస్తున్నాయి. ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటున్నారు దంపతులు.
ఇటీవల చాలా మంది ప్రతి చిన్న విషయానికి తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకున్న నిర్ణయానికి తర్వాత పశ్చాత్తప పడుతున్నారు.. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, పని ఒత్తిడి, వివాహేతర సంబంధాలు.. ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య వివాదాలు చెలరేగడం.. అవి చిలికి చిలికి గాలివానగా మారి ఎన్నో దారుణాలకు తెరలేపుతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకొని ఆనందంగా గడపాల్సిన ఓ యువజంట దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటన విజయపుర లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కర్ణాటక విజయపూర్ నగర శివార్లలోని శ్రీ సిద్దేశ్వర్ బరంగయ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంట్లో యువ జంట ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడటం తీవ్ర కలకం రేపింది. మృతులు మనోజ కుమార్ పోలా(30), రాఖీ(23) గా గుర్తించారు. నాలుగు నెలల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు మనోజ్, రాఖీ. మంగళవారం భోజనాలు చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ఫ్యాన్ కి ఉరి వేసుకొని ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సమయంలో మనోజ్ కుమార్ తల్లి భారత తన కూతురు ఇంటికి వెళ్లింది. తెల్లవారుజామున తిరిగి ఇంటికి చేరుకొని మనోజ్, రాఖిలను ఎంతగా పిలిచినా స్పందన రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లను పిలిచి తలపులు బద్దలు కొట్టి చూడగా ఇంట్లో ఇద్దరు ఊరి వేసుకొని ఉండటం చూసి మనోజ్ తల్లి భారతి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ఈ విషయం పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి పరిశీలించి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. నవ దంపతులు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారన్న విషయంపై క్లారిటీ రాలేదు. జలనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నవ దంపతులు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఎంతో అందమైన జీవితాన్ని ఊహించుకున్నారు.. కానీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారో అర్థం కావడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Also read
- నెల్లూరులో రౌడీ షీటర్లకు వెరైటీ పనిష్మెంట్.. అలా ఉంటది ఖాకీల తో పెట్టుకుంటే
- Viral News: చెప్తే అర్థం చేసుకుంటారనుకుంది.. తల్లిదండ్రులు మోసాన్ని తట్టుకోలేకపోయింది.. చివరకు..
- Andhra Pradesh: ఛీ.. ఏం మనుషులురా.. కూతురిని కూడా వదలని తండ్రి.. నెలల పాటు దారుణంగా..
- Telangana: ప్రేమన్నాడు.. వల వేసి కోరిక తీర్చుకున్నాడు.. ఆపై వెలుగులోకి అసలు ట్విస్ట్
- Guntur: ఉలిక్కిపడ్డ గుంటూరు.! పట్టపగలు ముగ్గురు మైనర్లు చేసిన పని తెలిస్తే గుండె ఆగినంత పనవుతుంది





