ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కూలీలందరూ పరుగులు తీశారు. ఏం జరిగిందో ఎందుకు పరుగులు తీస్తున్నారో తెలుసుకునేలోపై జరగాల్సింది జరిగిపోయింది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో వాటి నుంచి తప్పించుకునే దారి తెలియక సుమారు 20కి మంది పైగా కూలీలు గాయాల పాలయ్యారు.
ఏలూరు, మే 14: ఒక్కసారిగా ఆ ప్రాంతంలో ఉన్న కూలీలందరూ పరుగులు తీశారు. ఏం జరిగిందో ఎందుకు పరుగులు తీస్తున్నారో తెలుసుకునేలోపై జరగాల్సింది జరిగిపోయింది. ఒక్కసారిగా తేనెటీగలు చుట్టుముట్టి దాడికి తెగబడడంతో వాటి నుంచి తప్పించుకునే దారి తెలియక సుమారు 20కి మంది పైగా కూలీలు గాయాల పాలయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని విలీన మండలమైన కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో చోటుచేసుకుంది. దామరచర్ల గ్రామంలోని గ్రామస్తులు ఉపాధి హామీ కూలి పనికి వెళ్లారు. వారందరూ ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు. అయితే ఆ ప్రాంతానికి ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో తెలియదు గానీ పెద్ద తేనెటీగల సమూహం వచ్చింది. అక్కడ ఉపాధి హామీ పని చేస్తున్న కూలీలందరిపై ఒక్కసారిగా ఆ తేనెటీగలు దాడికి తెగబడ్డాయి. కనిపించిన వారిని కనిపించినట్టు గాయపరుస్తూ ఆ ప్రాంతంలోని కూలీలు అందర్నీ తీవ్ర భయాందోళనకు గురిచేశాయి.
దాంతో అక్కడున్నవారు అందరూ ఒక్కసారిగా అక్కడి నుంచి పరుగులు తీయడం ప్రారంభించారు. తోటి పనివారికి తమ పక్కన ఉన్న వారు ఎందుకు పరుగులు పెడుతున్నారో తెలియనంతగా అక్కడ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అయితే వారు తేరుకుని తేనెటీగలు తమపై దాడి చేస్తున్నాయని గ్రహించి కొందరూ తమ వద్ద ఉన్న కండువాలను తిప్పుతూ వాటిని దూరంగా తరిమే ప్రయత్నం చేశారు. అప్పటికే సుమారు 20 మందికి పైగా ఉపాధి హామీ కూలీలు తేనెటీగల దాడిలో గాయపడ్డారు. తేనెటీగల దాడిలో గాయపడిన కూలీలను హుటాహుటిన అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. ఆసుపత్రిలో వైద్యులు బాధితులకు వైద్య చికిత్సలు అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు
Also read
- ఈ రెండు చెట్లు ఇంట్లో ఉంటే డబ్బు అస్సలు నిలవదట..! మీ ఇంట్లో ఉన్నాయా..?
- Astrology Tips: మీ తలపై బల్లి పడిందా?.. ఆ పెద్ద మార్పుకు టైమ్ దగ్గరపడినట్టే!
- ఇంట్లో శివలింగం పెట్టేముందు ఈ నియమాలు తెలుసుకోండి.. లేదంటే శివదోషం తప్పదట!
- పోలీసులను చూసి పరుగో పరుగు.. పట్టుకుని విచారించగా బయటపడిన షాకింగ్ నిజం
- ఎవడ్రా నువ్వు.. దొంగతనానికి వచ్చి వండుకుని తిని.. పోలిసులకే సవాల్ విసిరావ్..





