పచ్చని సంసారంలో చిచ్చురేగింది. భర్త వేధింపులతో వివాహిత మహిళ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆమె తీసుకున్న నిర్ణయంతో ఇద్దరు పిల్లలు అన్యాయం అయ్యారు. ఈ విషాద ఘటన యాదాద్రిలో చోటుచేసుకుంది
భార్యాభర్తల మధ్య గొడవలు అనేది సర్వసాధారణం. టీ కప్పులో తుఫాన్ లా వచ్చిపోతుంటాయి. సంసారంలో వచ్చే చిన్నపాటి గొడవలకు సర్థుకుంటూ పోతూ ముందుకు సాగాలి. కుటుంబంలో ఎన్ని సమస్యలు వచ్చిన పరిష్కరించుకుంటూ, అలానే సర్థుకుపోతుంటారు. ఇటీవలి కాలంలో దంపతుల మధ్య వచ్చే గొడవలు ఎక్కువగా ఆర్థిక పరమైన సమస్యలు, ఈగోలు, వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. దంపతుల మధ్య తలెత్తే సమస్యలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. తాజాగా ఓ వివాహిత తీసుకున్న నిర్ణయం కారణంగా ఇద్దరు పిల్లలకు తీరని అన్యాయం జరిగింది. ఈ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది.
తల్లి తీసుకున్న నిర్ణయం అభంశుభం తెలియని పిల్లల పాలిట శాపంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. యాదగిరిగుట్ట మండలం యాదగిరిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన బూడిద యాదయ్య, దేవమ్మ దంపతుల చిన్న కూతురు గడిపె నాగమణి(25)ని జనగామ జిల్లా నాగారం గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ ప్రవీణ్‌కు ఇచ్చి 2020లో వివాహం జరిపించారు. వీరికి వర్ధన్(3), లక్ష్మీ ప్రసన్న(9 నెలల) పిల్లలు కలిగారు. కొంత కాలం వరకు బాగానే సాగిన వీరి కాపురంలో కలహాలు చోటుచేసుకున్నాయి. భర్త తన వక్రబుద్దిని బయటపెట్టాడు. పిల్లలు కలిగిన కొంతకాలానికి భర్త వరకట్న వేధింపులు, గృహ హింసకు గురిచేయడం మొదలు పెట్టాడు. అంతేగాక మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని నాగమణికి నరకం చూపించాడు. దీంతో అతడి వేధింపులు భరించలేక ఊర్లో పంచాయితీ పెట్టించింది. కానీ అతనిలో మార్పు రాలేదు. ఇక చేసేదేం లేక ఈ నెల 3న పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటికి చేరింది.
భర్త వేధింపులతో మానసికంగా కుంగిపోయిన నాగమణి జీవితంపై విరక్తి చెందింది. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఆ సమీపంలోని వ్యవసాయ బావిలో దూకింది. ఇది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి బావి వద్దకు చేరుకున్నారు. హుటాహుటిన బావిలో దూకి, ఆమెను రక్షించి భువనగిరి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. తల్లికి ఏమైందో తెలియక అమాయకంగా చూస్తున్న పిల్లలను చూసిన ప్రతిఒక్కరి హృదయం ద్రవించింది.
Also read
- Auspicious Yogas: ఈ నెల 21న అరుదైన యోగాలు.. దీర్ఘాయువు, ఆయుస్సు కోసం ఎలా పుజించాలంటే..
- Brahma Muhurta: బ్రహ్మ ముహూర్తంలో మేల్కొంటే ఎన్ని లాభాలో తెలుసా . . ఏ పనులను శుభప్రదం అంటే..?
- నేటి జాతకములు..19 జూలై, 2025
- Visakhapatnam Kidney Racket: అందమైన సాగరతీరంలో కిడ్నీ రాకెట్ కలకలం..! విచారణలో విస్తుబోయే వాస్తవాలు..
- Andhra News: ఉద్యోగం వదిలి వచ్చి పెళ్లైన వ్యక్తితో కూతురు ప్రేమాయణం.. తల్లిదండ్రులు ఏం చేశారంటే!