హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం
చల్లబడింది. మంగళవారం కుండపోత వర్షం కురిసింది. అకాల వర్షాల నేపథ్యంలో ప్రమాదాల కారణంగా రెండు రాష్ట్రాల్లో పలువురు మృతిచెందారు.
కాగా, హైదరాబాద్లోని బాచుపల్లిలోని రేణుక ఎల్లమ్మ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సెంట్రింగ్ పని కార్మికుల షెడ్పై కూలిన రిటైనింగ్ వాల్. భారీ వర్షానికి కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న గోడ కూలిపోవడంతో ఏడుగురు కార్మికులు మృతి చెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, సీఎన్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాలను బయటకు తీశారు. ఇక, మృతులను ఒడిషా, ఛత్తీస్గడ్కు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఇక, ఏపీలో కూడా పిడుగుల కారణంగా ఏడుగురు మృత్యువాడపడ్డారు.
Also read
- అమెరికా వీసా రాక యువతి ఆత్మహత్య
- తల్లితో వివాహేతర సంబంధం.. కూతురుపై అత్యాచారం..!
- Andhra: రేయ్.. ఏంట్రా ఇది.. బయట బోర్డేమో ఒకటి.. లోపల మాత్రం కథ వేరు.. అనుమానం వచ్చి వెళ్లగా..
- AP Crime: నెల్లూరులో దారుణం.. మహిళను వేధించాడు.. నడి రోడ్డుపై నరికారు
- నేటి జాతకములు….14 ఆగస్టు, 2025