బైక్ పార్కింగ్ విషయంలో తలెత్తిన వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన కోటాలో చోటుచేసుకుంది.
కోటా: రాజస్థాన్లోని కోటాలో ఘోరం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనం పార్కింగ్ విషయంలో సోదరుల మధ్య చెలరేగిన గొడవ తమ్ముడి ప్రాణాన్ని బలితీసుకుంది. కోటాలోని సుకేత్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జిరి గ్రామంలో ఇంటి బయట ద్విచక్రవాహనం పార్కింగ్ చేయడంపై సన్వార భీల్ (38), అతడి తమ్ముడు మనోజ్ భీల్ (30) మధ్య శుక్రవారం అర్థరాత్రి వివాదం తలెత్తింది. వారిద్దరి మధ్య మాటామాటా పెరగడంతో సన్వారా భీల్ తమ్ముడిపై గొడ్డలితో దాడి చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. మనోజ్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. అతడిపై పలు సెక్షన్ల కిం కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- నేటి జాతకములు 10 సెప్టెంబర్, 2026
- (no title)
- కాళ్ల పారాణి ఆరకముందే తీరని విషాదం.. పాపం పెళ్లైన 6 రోజులకే వరుడు..
- పగలు భక్తులు.. రాత్రయితే దొంగలు.. దేవుడి సొమ్ము ఎలా దోచుకుంటున్నారో తెలుసా..?
- కారు కొనిచ్చి, రూ. 40 లక్షలు ఆర్థిక సహాయం.. ప్రియుడి చేసిన పనికి సాఫ్ట్వేర్ యువతి షాకింగ్ నిర్ణయం!





