ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..
కడప : ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వైఎస్సార్ జిల్లా చెన్నూరు మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని గొర్ల పుల్లయ్యగారి వీధికి చెందిన ఉమామహేశ్వరి, శ్రీహరికి 18 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు(17), కుమార్తె(16) ఉన్నారు. భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమామహేశ్వరి తన ఇద్దరు పిల్లలను తీసుకుని అదే ప్రాంతంలో భర్తకు దూరంగా నివాసం ఉంటోంది. గొడవలకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. కోర్టు కేసులతో పాటు భర్తకు దూరమయ్యాననే బాధతో ఆమెకు జీవితంపై విరక్తి ఏర్పడింది. దీంతో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంటానని ఆదివారం సాయంత్రం ఇద్దరు పిల్లలను తీసుకెళ్లింది. భర్త శ్రీహరి ఫిర్యాదు మేరకు పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈక్రమంలో ఉమామహేశ్వరి, ఆమె కుమారుడు, కుమార్తె వల్లూరు మండల కేంద్రంలో ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సోమవారం పోలీసులు గుర్తించారు.
Also read
- Weekly Horoscope: వారికి ఆర్థికంగా అదృష్టం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి వారఫలాలు
- వృద్ధాప్యంలో తిండి పెట్టని కొడుకులు.. ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిన తండ్రి! ఎక్కడంటే..
- Hyderabad: రైల్వే స్టేషన్లో అనుమానాస్పందంగా కనిపించిన యువతి.. ఆపి చెక్ చేయగా…
- నేటి జాతకములు..24 జనవరి, 2026
- Crime News: ఎంతకు తెగించార్రా.. ఆ పని తప్పని చెప్పిన పాపానికి.. ఇంతలా వేధిస్తారా?





