కోడూరు:- చంద్రబాబు ప్రభుత్వం రాగానే 20వేల ఉద్యోగాలు మెగాడీఎస్సీ ద్వారా భర్తీ చేస్తారని ఉద్యోగం వచ్చేవరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కోడలు నాగ స్వాతి అన్నారు. శనివారం కోడూరు మండలం కోడూరులో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పితాని సత్యనారాయణకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చాలని ఎంపీ అభ్యర్థి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపించకుండా నిర్లక్ష్యం చేయడం కారణంగా నిరుద్యోగులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక తల్లిదండ్రులకు భారంగా మారారు అన్నారు. ప్రతి ఏడాది జాబ్ క్యాలండర్ విడుదల చేస్తానని చెప్పిన జగన్ రెడ్డి నిరుద్యోగులకు మొండి చేసి చూపించారన్నారు. నిరుద్యోగ యువత యొక్క ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే చంద్రబాబు అధికారంలోకి రావాలని ఉమ్మడి కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే నాయకుడ్ని గెలిపించుకోవాలని కోరారు. మాయ మాటలు చెప్పి ఎన్నికల తనంతరం మొహం చాటేసి నేతలను ఇంటికి పంపించాలని కోరారు.
Also read
- దీపావళి ఏ రోజు జరుపుకోవాలో తెలుసా? పండితులు ఇచ్చిన క్లారిటీ ఇదే!
- Hyderabad : రేవ్ పార్టీ భగ్నం.. పోలీసుల అదుపులో 72 మంది ఫెర్టిలైజర్ డీలర్లు
- AP Crime: గుంటూరులో ఘోరం.. రన్నింగ్ ట్రైన్లో మహిళను రే**ప్ చేసి.. ఆపై డబ్బులు, నగలతో..
- HOME GUARD ABORT : ప్రేమ పేరుతో మోసం చేసిన హోంగార్డు..అబార్షన్ వికటించి యువతి మృతి
- Bengaluru : భార్యను స్మూత్ గా చంపేసిన డాక్టర్.. ఆరు నెలల తరువాత బిగ్ ట్విస్ట్!
YS వివేకా హత్యలో జగన్ భార్య భారతి పాత్ర: సునీత సంచలన వ్యాఖ్యలు