ఓ ఆకతాయి వికృత చేష్టలకు గురైన బాలుడు తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం అనికేపల్లి ఈ ఘటన వెలుగుచూసింది. తన చేతికి చిక్కిన బాలుడి మలద్వారంలో పంపు పెట్టిన రాజా అనే వ్యక్తి.. బలవంతంగా గాలి కొట్టాడు. వివరాలు తెలుసుకుందాం పదండి…
సరదాకు అంటూ ఓ హద్దు ఉంటుంది. పరిధి దాటితే వాటిని వికృత చేష్టలనే అంటారు. తాజాగా ఓ వ్యక్తి చేసిన.. ఓవరాక్షన్‌కు బాలుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఆస్పత్రిలో ఇప్పుడు ప్రాణాల కోసం పోరాడతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా… వెంకటాచలం మండలం అనికేపల్లికి చెందిన 12 ఏళ్ల బాలుడు.. బుధవారం ఫ్రెండ్స్‌తో వాలీబాల్ ఆడాడు. కొంతసేపు ఆడిన తర్వాత బంతిలో గాలి తగ్గింది. గాలి కొట్టే పంపు కోసం దగ్గర్లోని గ్రామ సచివాలయం వద్ద వాలీబాల్ ఆడుతున్న యువకుల వద్దకు పిల్లలు వెళ్లారు. అక్కడ తొలికొండ రాజా అనే వ్యక్తి.. బాలుడిని పట్టుకున్నాడు. అతని బిహేవియర్ చూసి.. మిగతా పిల్లలు అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత తన చేతికి చిక్కిన బాలుడికి చుక్కులు చూపించాడు.. రాజా.
బాలుడి మలద్వారంలో పంపుతో.. బలవంతంగా గాలి కొట్టాడు. అనంతరం ఇబ్బందికి గురైన బాలుడు.. సరాసరి ఇంటికి వెళ్లిపోయాడు. కొంతసేపటికి బాలుడి కడుపు ఉబ్బడంతో పాటు మర్మాంగాలు వాచాయి. మొదట ఏం అవ్వదులే అని విషయం ఇంట్లో చెప్పలేదు. రాత్రి సమయంలో.. నొప్పి తీవ్రమై విలవిల్లాడిపోయాడు. బిగ్గరకు ఏడవడంతో.. తల్లిదండ్రులు వెంటనే… నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడి నుంచి గురువారం గవర్నమెంట్ ఆస్పత్రికి తలరించారు. బాధితుడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. పోలీసులు నిందితుడిపై ఫోక్స్ కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
Also read
- Today Horoscope: ఈరోజు పన్నెండు రాశులకు ఎలా ఉంటుంది? మీ రాశి ఫలాలు చూసుకున్నారా?
- కన్నకూతురిపైనే అత్యాచారం.. తండ్రిపై పోక్సో కేసు నమోదు
- అన్నా భయంగా ఉంది.. చంద్రకళ ఏదేదో మాట్లాడుతుంది..!
- హైదరాబాద్ లో మహిళ అనుమానాస్పద మృతి..
- ఏం ప్లానయ్యా.. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రైవేట్ డాక్టర్.. అసలు మ్యాటర్ తెలిస్తే..





