కృష్ణాజిల్లా, గుడివాడ నియోజకవర్గo: ఇండిపెండెంట్గా నామినేషన్ వేయడానికి వెళ్లిన నన్ను నా పేరు చెప్పగానే ఆర్డీవో తక్షణమే నన్ను బయటకు పంపించి వేసి నాపై క్రిమినల్ కేసు నమోదు చేయమని పోలీసులకు చెప్పారని కొడాలి వెంకటేశ్వరరావు అనే వికలాంగుడు మీడియా ముందు వాపోయాడు.
వివరాల్లోకి వెళితే గుడ్లవల్లేరు మండలం కుచ్చికాయలపూడి గ్రామానికి చెందిన కొడాలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసేందుకు గుడివాడ ఆర్డీవో కార్యాలయానికి వెళ్లి తన పేరు కొడాలి వెంకటేశ్వరరావు అని చెప్పగానే ఆర్డీవో తనను బయటకు పంపించి వేశారని, పోలీసులను పిలిపించి ఇతని మీద క్రిమినల్ కేసు నమోదు చేయమని చెప్పారని వెంకటేశ్వర రావు తెలిపారు .
తాను దళిత కులానికి చెందిన వాడినని, అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో తాను ఎన్నికలలో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని, తనను రిటర్నింగ్ అధికారి బయటకు పంపించి వేయడంతో అక్కడే మరో అభ్యర్థి కోసం వచ్చిన కొంత మంది లాయర్లు ఆర్డీవోతో వాగ్వాదానికి దిగడంతో మరల తనని లోపలికి పిలిపించారని వెంకటేశ్వర తెలిపారు.
దళితుడైనందువలన ఆర్డీవో తనను ఆవామాన పరిచారని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేయనన్నట్లు వెంకటేశ్వరరావు తెలిపారు.
Also read
- Astro Tips for Marriage: గ్రహ శాంతి పూజ అంటే ఏమిటి? వివాహానికి ముందు గ్రహ శాంతి పూజను ఎందుకు చేస్తారో తెలుసా..
- శివ శక్తి రేఖ: పూర్వీకుల మేధస్సుకి చిహ్నం ఈ 8 శివాలయాలు.. ఒకే రేఖాంశం పై నిర్మాణం..
- మీరు వచ్చే జన్మలో ఎలా పుట్టనున్నారు.? మీరు చేసే పనులే ఆ విషయం చెబుతాయి..
- నేటి జాతకములు…8 డిసెంబర్, 2025
- ఒకరితో ప్రేమ… మరొక అమాయకుడితో పెళ్లి!





