నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
తిరుపతి: నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రగిరి అభ్యర్థులు పులివర్తి నాని (తెదేపా), చెవిరెడ్డి మోహిత్రెడ్డి (వైకాపా) నామినేషన్ వేసేందుకు తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ముందుగా మోహిత్రెడ్డితో పాటు ఆయన తండ్రి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి కార్యాలయానికి రాగా.. కొద్ది సేపటికి పులివర్తి నాని, చిత్తూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి వరప్రసాదరావు వచ్చారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు.

ఈ క్రమంలో మోహిత్రెడ్డి వెనుక ఉన్న కొందరు వైకాపా కార్యకర్తలు తెదేపా జెండాలను కింద వేసి తొక్కారు. దీనిపై నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు రాళ్లతో దాడి చేశాయి. సమీపంలో మురుగుకాల్వ కల్వర్టు నిర్మాణానికి ఉంచిన కంకర రాళ్లను విసిరారు. తెదేపా కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. దాదాపు రెండుగంటల పాటు ఘర్షణ జరిగింది. ప్రధాన పార్టీలైన తెదేపా, వైకాపా అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ, ప్రదర్శనకు ఒకే సమయంలో పోలీసులు అనుమతివ్వడంపై విమర్శలు వినిపిస్తున్నాయి.

Also read
- సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో శుభఫలితాలు పొందండి!
- ఈ రాశుల వారు పెట్టి పుట్టారు.. కోరుకున్నది జరిగే సమయం ఆసన్నం.. మీరున్నారా?
- Hyderabad: ప్రేమ పేరుతో వల.. ఐదుగురు యువతులతో వ్యవహారం.. మైనర్పై దారుణం!
- నాన్న నేనేం తప్పు చేశాను.. ఎందుకు నన్ను చంపేశావ్.. ఒంగోలులో గుండెల్ని పిండేసే ఘటన..
- జర్నలిస్ట్ ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో కలకలం





